• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెట్రోల్ బంక్ లో దోపిడీ.....

పెట్రోల్ బంక్ లో దోపిడీ.. దొంగల దారుణం..

By - Tupaki Desk
Update: 2018-12-27 11:13 GMT
తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే దోపిడీ హత్య చోటుచేసుకుంది.  ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్న ముగ్గురు వ్యక్తులు బంకులో పనిచేసే వ్యక్తి వద్దనున్న డబ్బుల సంచిని లాక్కొనే ప్రయత్నం చేశారు. అతడు ఇవ్వకుండా ప్రతిఘటించడంతో దారుణంగా కత్తులతో పొడిచి పొడిచి చంపారు.

చెన్నైలోని హైవే పై ఉన్న  పెట్రోల్ పంపులో అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న శివకుమార్ అనే వ్యక్తి యథావిధిగానే పెట్రోల్ పోస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. హైవే పక్కనే ఉన్న ఈ పెట్రోల్ పంపు వద్దకు రాత్రి వచ్చిన ముగ్గురు పెట్రోల్ పంపులో ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారని గుర్తించారు. పెట్రోల్ పోశాక శివకుమార్ వద్దనున్న బ్యాగును లాక్కునే ప్రయత్నం చేశారు.కానీ శివకుమార్ ప్రతిఘటించాడు. దీంతో తమ వద్దనున్న కత్తులు తీసి శివకుమార్ మెడ - చాతి - కడుపులో విచక్షణారహితంగా దుండగుడు పొడిచాడు.5000 ఉన్న డబ్బు సంచిని తీసుకొని పారిపోయారు.

శివకుమార్ ను పొడుస్తున్నప్పుడు పక్కనే ఉన్న తోటి సిబ్బంది భయంతో పారిపోయాడు. కనీసం ఆ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. నేరుగా పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు వచ్చి చూసేసరికి శివకుమార్ చనిపోయాడు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డు కావడంతో నిందితులను గుర్తించే పనిలో పోలీసులున్నారు.

తమిళనాడులో ఇటీవల హైవేలపై వరుసగా దారి దోపిడీలు జరుగుతున్నాయి. ఆ ముఠానే పెట్రోల్ బంకులో వ్యక్తిని చంపి డబ్బులు ఎత్తుకెళ్లినట్టు చెన్నై పోలీసులు పేర్కొన్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View



Tags:    
  • Robbery 
  • Petrol Bunk 
  • Chennai 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS