కాలిన చోటే పూలవాన

Update: 2016-02-08 09:41 GMT
కాపు ఐక్యగర్జన అల్లర్ల సందర్భంగా ఆందోళనకారులు తగలబెట్టిన విజయవాడ-విశాఖ రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు ఎట్టకేలకు ఎనిమిది రోజుల తరువాత సోమవారం ఉదయం విజయవాడ నుంచి విశాఖకు బయలుదేరింది. బోగీలన్నీ కాలిపోవడంతో రద్దు చేసిన ఈ రైలుకు బోగీలు దొరకడంలో ఆలస్యమైంది.  24 బోగీలుండాల్సిన ఈ రైలు ప్రస్తుతం 17 బోగీలతో పట్టాలెక్కింది. 8 రిజర్వేషన్‌ బోగీలు - 4 సాధారణ - 2 ఏసీ ఛైర్‌ కార్లు - రెండు ఎస్‌ ఎల్‌ ఆర్‌ ల తో బయలుదేరిన రత్నాచల్ తుని వద్దకు రాగానే ప్రజలు దానికి బ్రహ్మరథం పట్టారు.  వారం కిందట అక్కడే అగ్నికీలల్లో మాడిమసైపోయిన రత్నాచల్ ఇప్పుడు పూలదండలతో కొత్త పెళ్లి కూతురులా కనిపించింది. స్థానికులు పూల దండలతో రైలుకు స్వాతం పలికి... డ్రైవర్‌ కు పూలదండలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

విజయవాడ - విశాఖల మధ్య రత్నాచల్ ఎంతో కీలకమైన రైలు. ఉద్యోగులు - వ్యాపారులు... విశాఖపట్నానికి వివిధ పనులపై వెళ్లేవారు... విజయవాడ నుంచి రాజమండ్రి, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అందరూ వేగంగా చేరుకునేందుకు రత్నాచల్ నే ఆశ్రయిస్తారు. అంతేకాదు... హైదరాబాద్ నుంచి వచ్చేవారు కూడా అక్కడ అర్ధరాత్రి దాటాక బయలుదేరితో పొద్దున్నే రత్నాచల్ అందుకుని విశాఖకు వెళ్తారు. అంతటి ముఖ్యమైన రైలు వారం రోజులుగా లేకపోవడంతో ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు.

రైలు పూర్తిగా కాలిపోవడం.. బోగీలు అందుబాటులో లేకపోవడంతో రైల్వే అధికారులు కూడా వెంటనే ఏమీ చేయలేకపోయారు. అయితే... ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడం వంటి చర్యలతో వారం వ్యవధిలోనే రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు పట్టాలకు ఎక్కింది.
Tags:    

Similar News