• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లవర్ బాయ్ గా...

లవర్ బాయ్ గా రాహుల్...జోడో యాత్రతో కొత్త ఇమేజ్

By - Tupaki Desk
Update: 2022-09-14 23:30 GMT

రాహుల్ గాంధీ వయసు చెప్పకపోతే వెరీ యంగ్ అనే అనుకుంటారు. నిజానికి ఆయన వయసుకు ఆయన ఫిజిక్ కి కూడా ఏ మాత్రం సంబంధం లేదు. ఆయన ఫిట్ నెస్ ని అలా మెయిన్ టెయిన్ చేస్తారు. ఇక ఆయన క్యూట్ లుక్స్ కూడా లేడీ ఫ్యాన్స్ ని పెద్ద  ఎత్తున పెంచేశాయి. రాహుల్ అయిదు పదులు దాటిన వారు. ఇప్పటికీ పెళ్ళి కానీ ఘోటక బ్రహ్మచారి. ఆయన నాకొద్దీ పెళ్ళి అని ఎపుడూ బాహాటంగా చెప్పలేదు.

అదే టైం లో ఆయన పెళ్ళి కావాలి అని కూడా ఏ రోజు అనుకోని ఉండరు. లేకపోతే ఇన్నేళ్ళ పాటు ఖాళీగా ఉంటారా. ఏది ఏమైనా రాహుల్ సినీ హీరోలకు ఏ మాత్రం తగ్గని గ్లామర్ తో మెరిసిపోతారు. ఆయన రాజకీయాల్లోకి  అరంగేట్రం చేసిన దగ్గర నుంచి పెళ్ళి చేసుకోమనే వారూ ఉన్నారు. అలాగే పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిన వారూ ఉన్నారు.

ఆయన దేశంలో ఎక్కడ పర్యటించిన రాజకీయాల కంటే కూడా ఆయన పెళ్ళి ప్రస్థావనే ఎక్కువగా వస్తుంది. అలాంటి రాహుల్ ఒక మీటింగ్ కోసం అప్పట్లో తమిళనాడు వస్తే ఆయన చుట్టూ అమ్మాయిలు భారీగా చేరారు. ఇక ఇపుడు ఆయన ఏకంగా పాదయాత్ర పేరిట జనాల వద్దకే నడచుకుని వస్తున్నారు. దాంతో ఎవరైనా ఊరుకుంటారా.

తమిళనాడులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఒక మహిళా కూలీ అయితే రాహుల్ బాబూ పెళ్ళి చేసుకో అంటూ కోరడంతో ఆయన ఎర్రగా ముఖం పెట్టేసి సిగ్గుల మొగ్గ అయిపోయారు. మా తమిళనాడు అంటే మీకు చాలా ఇష్టమని తెలుసు. ఇక్కడ బోలేడు మంది అమ్మాయిలు ఉన్నారు చూడమంటారా అని సూటిగా అడిగేసరికి ఏం చెప్పాలో రాహుల్ కి తెలియక కొంతసేపు సైలెంట్ అయిపోయారు.

ఇక అక్కడ నుంచి కేరళకు వచ్చి ఆ రోడ్ల మీద ఆయన పాదయాత్ర చేస్తూంటే అక్కడ కూడా లేడీస్ రాహుల్ తో అడుగులు వేస్తూ ఆయనను చూస్తూ మురిసిపోతున్నారు. ఒక మహిళ అయితే రాహుల్ కోసం పరిగెత్తుకుని వచ్చి మరీ రోడ్డు మీదనే గట్టిగా వాటేసుకుని అలా కొంతసేపు ఉండిపోయింది. దాంతో షాక్ తినడం రాహుల్ వంతు అయింది. ఆయన ఆమెను అలా అభిమానపూర్వకంగా భుజం మీద తడుతూ పక్కన పెట్టుకుని నడిచారు.

అయినా సరే ఆ మహిళా ఎక్కడా తగ్గలేదు. రాహుల్ భుజం మీద తన తల పెట్టుకుని మరీ కొంతసేపు అలా ప్రేమగా ఆయన్నే చూస్తూ నడవడం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాహుల్ కోసం ఇంత మంది ఇన్ని రకాలుగా తమలోని పిచ్చి ప్రేమను అలా బాహాటంగా చూపించడం చూస్తే ఆయనలో మంచి నాయకుడు కంటే అద్భుతమైన ప్రేమికుడు ఉన్నాడని అనిపించకమానదు. నిజానికి రాహుల్ గాంధీ అందగాడే. ఆయన తండ్రి రాజీవ్ మాదిరిగానే ఆయన కూడా ఎర్రగా బుర్రగా ఉంటారు.

రాహుల్ పెళ్ళి చేసుకోకపోవడం  ప్లస్ పాయింట్ గా మారి ఆయనకు సరికొత్త ఇమేజ్ ని తెచ్చిపెడుతోంది. మొత్తానికి మూడు వేల అయిదు వందల కిలోమీటర్ల భారీ పాదయాత్రలో రాహుల్ నడచింది ఇప్పటిదాకా వంద కిలోమీటర్లు అయితే దారిపొడువునా ఇలా మహిళాభిమానం వెల్లి విరుస్తోంది.

మరి పూర్తి యాత్ర అయ్యేనాటికి రాహుల్ కోసం ఎంతమంది ఎదురు నిలిచి తమ అభిమానాన్ని చాటుకుంటారో. ఈ యాత్ర కంప్లీట్ అయ్యేనాటికి రాహుల్ ఇమేజ్ అయితే పూర్తిగా మారిపోయి లవర్ బాయ్ గా కనిపిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా రాహుల్ మీద ఇంతటి అభిమాననా అని ఏ హీరోకు తీసిపోని ఈ నీరాజనాన్ని చూస్తూ కాంగ్రెస్ శ్రేణులు హుషార్ అవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • congress 
  • nationalparty 
  • congressparty 
  • rahulgandhi 
  • JodoYatra 
  • latestnews 

Similar News

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS