• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Food >  తిండి క‌ల్తీ.. నెయ్యి...

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

| ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన.. తీవ్రమైన పరిశుభ్రత లోపాలు ఉన్న 19 ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు.

By - Sivaji Kontham
Update: 2026-11-03 14:30 GMT

తినే ఆహారం క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. ఆయిల్స్ క‌ల్లీ.. ప‌ప్పు ఉప్పులు.. చివ‌రికి మందులు కూడా క‌ల్తీ. ప్ర‌స్తుతం క‌ల్తీమ‌య‌మైన స‌మాజంలో జీవిస్తున్నందున ప్ర‌తి ఒక్క‌రిలో ఏదో ఒక ర‌కంగా అంత‌ర్గ‌తంగా ఆందోళ‌న నెల‌కొంది. మహారాష్ట్రలో పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.డి.ఏ) నిర్వహించిన ప్రత్యేక దాడులలో భారీగా కల్తీ - నాణ్యత లేని ఆహార పదార్థాలు పట్టుబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు డివిజన్లలోని 114 వ్యాపార సంస్థలపై నిర్వహించిన ఈ తనిఖీల్లో సుమారు రూ. 9.01 కోట్ల విలువైన 3.53 లక్షల కిలోల ఆహార పదార్థాలను ఎఫ్‌డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన.. తీవ్రమైన పరిశుభ్రత లోపాలు ఉన్న 19 ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు.

ఈ దాడుల్లో భాగంగా ఛత్రపతి శంభాజీనగర్‌లోని పతంజలి ఆయుర్వేద్ సూపర్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఎం బై ఎస్ దివ్య మహావితరక్ వద్ద సుమారు రూ. 20.20 లక్షల విలువైన 2,279.7 లీటర్ల పతంజలి ఆవు నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. తప్పుడు లేబులింగ్, కల్తీ జరిగిందన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ప్రాథమిక విచారణలో ఈ నిల్వలు 2006 నాటి ఆహార భద్రత- ప్రమాణాల చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది.

ముంబై, అమరావతి.. ఛత్రపతి శంభాజీనగర్ విభాగాల పరిధిలోని నమ్‌కీన్, స్వీట్‌మీట్, మసాలా తయారీ యూనిట్లలో సరైన పరిశుభ్రత పాటించకపోవడం.. ఆహారాన్ని సక్రమంగా నిల్వ చేయకపోవడం.. పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలను అధికారులు గుర్తించారు. నిబంధనలను పాటించకుండా వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆయా సంస్థల రిజిస్ట్రేషన్లు, లైసెన్సులను అధికారులు తక్షణమే నిలిపివేశారు.

ఈ ముమ్మర తనిఖీలలో భాగంగా థానే జిల్లా భివాండిలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ నుండి 1,44,218 కిలోల వంటనూనెను.. సతారాలోని అమిన్ ట్రేడర్స్ నుండి 20,560 కిలోల బియ్యం, పప్పులు, బెల్లం వంటి ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పుణె డివిజన్‌లోని సతారా.. సోలాపూర్‌లోని ప‌లు ఆయిల్ మిల్లుల నుంచి కూడా పెద్ద ఎత్తున నూనె నిల్వలను సీజ్ చేయడం జరిగింది.

అక్టోబర్ 28 నుండి 31 మధ్య కాలంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 17 సంస్థల నుండి రూ. 79.40 లక్షల విలువైన నిషేధిత ఆహార పదార్థాలను సీజ్ చేయగా.. మొత్తం 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేసినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. అంతేకాకుండా నాసిక్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలను తనిఖీ చేసి 29 మెరుగుదల నోటీసులు జారీ చేశామని, ప్రజారోగ్యానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లోని ప‌లు ప్ర‌ముఖ స్వీట్ స్టాల్స్, హోట‌ల్స్ పై చేసిన దాడిలోను భారీగా అవ‌క‌త‌వ‌క‌లు, క‌ల్తీ, విషాహారాల‌ను ఎఫ్‌.డి.ఏ క‌నుగొన్న సంగ‌తి తెలిసిందే. ప‌లు కంపెనీల లైసెన్సుల‌ను కూడా ర‌ద్దు చేసారు.

Tags:    
  • foodadulteration 
  • maharashtraFDA 
  • patanjalighee 
  • foodsafety 
  • foodfraud 

Similar News

యాపిల్స్‌పై వ్యాక్స్ పూస్తారా? తినే ముందు ఈ విషయం తెలుసుకోండి

2026-10-30 05:22 GMT

కల్తీ ఆహారంతో ప్రాణాలకు ముప్పు.. తినే ముందు జాగ్రత్త!

2026-10-17 16:30 GMT

వెజ్ ఫుడ్ ..బాబోయ్ అనొద్దు బ్రో !

2026-10-01 05:02 GMT

'ప‌నీర్ విషం'పై ఫుడ్ సేఫ్టీ కొత్త నిబంధ‌నలు.. 'నాన్ డెయిరీ ప‌నీర్' నిషేధం!

2026-09-25 04:01 GMT

తెలంగాణ‌ లో అన‌లాగ్ ప‌న్నీర్ పై నిషేధం.. ఎందుకు.. ఏంటా స్టోరీ?!

2026-09-12 09:43 GMT

ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకెట్స్ పై రెడ్ వార్నింగ్? అసలు దీని అర్థం ఏంటో తెలుసా?

2026-08-30 00:30 GMT

హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ కు షాక్.. తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు

2026-07-08 08:11 GMT

అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవం.. తినేద్దామా మరోసారి!

2026-07-05 06:03 GMT

రాజభోగం అంటే ఇదే..కోట్ల విలువ చేసే ఐస్‌క్రీమ్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-06-07 16:30 GMT

అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటున్నారా? జాగ్రత్త.. ఆ రంగులు, రసాయనాలు మీ ప్రాణానికే ముప్పు!

2026-03-11 07:49 GMT

హైదరాబాద్ హాస్టళ్లలో ఆహార సంక్షోభం: ఇక దోసా, ఇడ్లీకి తాత్కాలిక బ్రేక్!

2026-03-11 05:55 GMT

Copyright @2026

Powered by Blink CMS