ఇక ఏపీ సర్కార్ ఆస్తి ‘పన్ను’ పీకేస్తుంది

Update: 2020-11-25 02:30 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చట్టానికి సవరణలు చేసింది. 2021-22 ఏడాది నుంచి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కిస్తారు. ఈ మేరకు పురపాలక శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రభుత్వం ఇకపై రిజిస్ట్రేషన్ విలువ సవరించిన ప్రతిసారి ఆస్తి పన్ను పెరుగనుంది. రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను 10శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. సవరించిన మేరకు ధార్మిక, విద్య, వైద్య, సాంస్కృతిక కట్టడానికి ఆస్తిపన్నును మినహాయించారు. సైనికులు, మాజీ సైనికుల గృహాలకు కూడా ఆస్తి పన్ను నుంచి వెసులుబాటు కల్పించారు.

375 చదరపు అడుగుల లోపు భవనాలకు వార్షిక ఆస్తిపన్ను రూ.50 అని నిర్ధారించారు. భవన శైలి ఆధారంగా ఆస్తి విలువ ఖరారు చేస్తారు. ఇల్లు డిజైన్ బట్టి పన్ను వడ్డించనున్నారు. ఆర్సీసీ, రేకులు, పెంకులు, నాపరాళ్లు, పూరిళ్లకు ఆస్తిపన్నును వర్గీకరించారు. ఆస్తిపన్ను నిర్ధారించే క్రమంలో అక్రమ కట్టడాలకు 25-100శాతం జరిమానా విధిస్తారు. నమూనా మారినా.. నిర్మాణ పెరిగిన భారీ జరిమానాలు ఉంటాయి. ఎంత అక్రమ నిర్మాణం ఉంటే అంతే భారీగా జరిమానాలు ఉంటాయి.

అంటే దీన్ని బట్టి ధనవంతుల ఇళ్లకు పన్ను మోత మోగనుంది. సామాన్యులకు పన్ను మినహాయింపు లభించే ఛాన్స్ ఉంది.
Tags:    

Similar News