మోడీకి యూట్యూబ్ లో డిస్ లైక్ ల వెల్లువ
ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడూ లైవ్ మీడియా సమావేశాలకు హాజరు కారు. జాతీయ మీడియాను స్ట్రైట్ గా ఎదుర్కొవడానికి తటపటాయిస్తారని ఢిల్లీలో చెప్పుకుంటారు. అయితే ప్రతీ ఆదివారం మాత్రం తెరవెనుక ఉండి రేడియోలో ‘మన్ కీ బాత్’ పేరతో తన భావాలు వ్యక్తం చేస్తుంటారు.
తాజాగా ఈ ఆదివారం కూడా ‘ఆల్ ఇండియా రేడియో’లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని దూరదర్శన్ తోపాటు కొన్ని ప్రైవేట్ చానెళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇక మోడీ, పీఐబీ, బీజేపీ యూట్యూబ్ చానెళ్లలో మోడీ ‘మన్ కీ బాత్’ వీడియోలను అప్ లోడ్ చేశారు.
ఆశ్చర్యకరంగా మోడీ ‘మన్ కీ బాత్’ వీడియోకు యూట్యూబ్ లో నెగెటివ్ స్పందన రావడం గమనార్హం. మోడీ వీడియోకు నెటిజన్లు డిస్ లైక్ లు భారీగా కొట్టారు. ఇప్పటివరకు మోడీకి లైక్ ల మీద లైక్ వస్తుంటే తాజాగా డిస్ లైక్ లు విపరీతంగా రావడం అందరినీ షాక్ కు గురిచేసింది.
మోడీ వీడియోకు బీజేపీ యూట్యూబ్ చానెల్ లో ఏకంగా సోమవారం ఉదయానికి డిస్ లైక్ 2.3 లక్షలు దాటాయి. లైక్ లు కేవలం 26వేలు మాత్రమే ఉండడం గమనార్హం. మోడీ యూట్యూబ్ లో డిస్ లైక్ లు 48వేలు, లైక్ లు 23వేలు వచ్చాయి. పీఐబీ చానెల్ లో డిస్ లైక్ లు 8వేలు వచ్చాయి. లైక్ లు 3.4 వేలు వచ్చాయి.
ప్రతీసారి ఏదో ఒక అంశంపై మాట్లాడే ప్రధాని మోడీ ఈసారి బొమ్మల తయారీలో స్వయం సంవృద్ధి సాధించాలని చెప్పారు. బహుశా కరోనాతో దేశం ఉద్యోగ, ఉపాధి కోల్పోయి ఉంటే వారికి భరోసానివ్వకుండా ఇలా మాట్లాడినందుకు యువత డిస్ లైక్ కు కొట్టి ఉంటారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
దీన్ని బట్టి మోడీ మన్ కీ బాత్ నెటిజన్లకు అస్సలు ఇష్టం లేనివిధంగా మాట్లాడారని తెలుస్తోంది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు మీడియాలో చర్చకు దారితీసింది.