పవన్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్

పవన్ రాకతో కొండగట్టు పరిసర ప్రాంతాలన్నీ అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు జనం చెట్లు, బిల్డింగ్‌లు, చివరికి కరెంటు స్తంభాలు కూడా ఎక్కేశారు.;

Update: 2026-01-03 16:42 GMT

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో సుమారు 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 95 గదుల వసతి గృహాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో పాటు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తదితరులు పాల్గొన్నారు.

పవన్‌కు కొండగట్టుతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. 2009 ఎన్నికల సమయంలో కరెంటు తీగలు తగిలి పెను ప్రమాదం నుండి ఆయన ప్రాణాలతో బయటపడటాన్ని భక్తులు, అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.ఇప్పుడు అలాంటిదే మరో పెను ప్రమాదం పవన్ కు తప్పింది.

జనసంద్రమైన కొండగట్టు.. ఉత్కంఠ రేపిన 'కారు ఫీట్స్'

పవన్ రాకతో కొండగట్టు పరిసర ప్రాంతాలన్నీ అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు జనం చెట్లు, బిల్డింగ్‌లు, చివరికి కరెంటు స్తంభాలు కూడా ఎక్కేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన కారు టాప్‌పై కూర్చుని అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

గతంలో ఇప్పటం గ్రామానికి వెళ్లేటప్పుడు కూడా పవన్ ఇలాగే కారుపై కూర్చుని వెళ్లారు. అయితే, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి ప్రమాదకరమైన పద్ధతిలో ప్రయాణించడం యువతకు తప్పుడు సందేశం ఇస్తుందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

పవన్‌కు కొండగట్టుతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. 2009 ఎన్నికల సమయంలో ఇదే ప్రాంతంలో కరెంటు తీగలు తగిలి ప్రమాదానికి గురై ఆయన ప్రాణాలతో బయటపడ్డ సంఘటనను అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అందుకే తాజా ఘటనతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

అయితే అభిమానులు మాత్రం దీనిపై స్పష్టత ఇస్తున్నారు. “ర్యాలీ సమయంలో చాలా తక్కువ ఎత్తులో కేబుల్‌లు వచ్చాయి. అవి తగలకుండా ఉండేందుకే పవన్ అప్రమత్తంగా కారుపై పడుకున్నారు. 2009 నాటి చేదు అనుభవం దృష్ట్యా ప్రమాదాన్ని ముందే గుర్తించి ఆయన అలా వ్యవహరించారు” అంటూ వీడియో ఆధారాలతో వివరణ ఇస్తున్నారు.

అదృష్టవశాత్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోవడంతో నాయకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన భక్తి పరంగా మాత్రమే కాకుండా తృటిలో తప్పిన ప్రమాదం వీడియోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Tags:    

Similar News