• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో కరోనా కిట్లపై...

ఏపీలో కరోనా కిట్లపై అవినీతి ఆరోపణలు!

By - Tupaki Desk
Update: 2020-04-19 07:51 GMT
దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఏపీ సీఎం జగన్ కరోనా విషయంలో ఎంతో చురుకుగా వ్యవహరిస్తున్నారు.  అత్యాధునిక టెక్నాలజీతో కరోనాను నియంత్రించి 10 నిమిషాల్లోనే వ్యాధి నిర్ధారణ చేసే పరికరాలు తయారు చేసిన దక్షిణ కొరియా దేశంతో ఏపీ ప్రభుత్వం తాజాగా సంప్రదింపులు జరిపి కరోనా టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసింది. ఇటీవలే కొరియా నుంచి ప్రత్యేక విమానంలో భారీగా కరోనా టెస్ట్ కిట్లను ఏపీలోని గన్నవరానికి తీసుకువచ్చారు. ఈ కిట్స్ తో వేగంగా కరోనా టెస్టులు చేస్తూ వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్సలు అందిస్తున్నారు.

పక్కనున్న తెలంగాణలో కూడా ఇంత వేగంగా పరీక్షలు జరగడం లేదు. దేశంలోనే సీఎం జగన్ తీసుకున్న చొరవపై అభినందనలు కురుస్తున్నాయి. కరోనాను నియంత్రించడంలో సీఎం జగన్ ముందుచూపుతో కరోనాను కట్టడి చేస్తున్నారంటున్నారు

అయితే నాణేనికి మరోవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీలో కరోనా నుంచి తెప్పించిన టెస్టింగ్ కిట్లపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒక్కో కిట్ తో రూ.700 రూపాయల అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.అదే కొరియా నుంచి చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఒక్కో కిట్ ను రూ.337కే తెప్పించుకుందని.. ఏపీ మాత్రం రూ.1200 పెట్టి ఎందుకు కొనుగోలు చేసిందని ప్రశ్నిస్తున్నారు.

ఇంతటి కరోనా వ్యాధి విస్తృతి వేళ దక్షిణ కొరియా నుంచి మనమే కాదు.. అమెరికా, ఇతర దేశాలు కూడా ఈ టెస్ట్ కిట్స్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. అమ్మేవాడి డిమాండ్ ను బట్టి ధర పెరుగుతూ పోతోంది. ఈ కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడం అర్థరహితంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కిట్స్ డిమాండ్ దృష్ట్యానే జగన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాల కోసం ఎంతో వెచ్చించి ఒప్పించి కిట్స్ తీసుకొచ్చింది. ధర భారీగా పెట్టి  అయినా తీసుకొచ్చి మంచిగా కరోనా పరీక్షలు చేస్తూ చర్యలు తీసుకుంటోంది. అయితే ఇందులోనూ ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయమని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

    


Tags:    
  • Opposition Parties 
  • Andhra government 
  • Coronavirus Testing Kits 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS