చంద్రబాబుకు మరో షాక్

Update: 2019-07-11 05:01 GMT
చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఉండవల్లిలోని ఆయన ఇల్లు అక్రమమని ఇప్పటికే అధికారులు తేల్చి నోటీసులు ఇచ్చారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అక్రమంగా కట్టుకున్న ప్రజావేదికను జగన్ కూల్చివేయించారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబుకు షాకిచ్చారు వైసీపీ నేతలు.

టీడీపీకి రాష్ట్ర పార్టీ కార్యాలయం అధికారికంగా ఇన్నాళ్లు లేదు. దీంతో కొత్త కార్యాలయం నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయాన్నే రాష్ట్ర కార్యాలయంగా టీడీపీ మార్చుకొని కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయం కార్పొరేషన్ సంస్థ స్థలంలో నిర్మించారని తాజాగా వైసీపీ నేతలు ఆరోపించారు. దాన్ని కూల్చివేయాలని గుంటూరు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో గుంటూరు టీడీపీ ఆఫీసును కూల్చడానికి గుంటూరు కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసిన కట్టి గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయం కూలిస్తే , చంద్రబాబుకు టీడీపీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.  

    

Tags:    

Similar News