అతడు రీల్ కాదు..రియల్ విక్రమ్ రాథోడ్!
తెలిసిందల్లా ఎన్ కౌంటర్లు చేయడమే. తప్పుడు దారిలో వెళ్లే వారి తాట తీయడమే అతడి ప్రత్యేకత.;
`చావు అంటే భయపడటానికి అల్లాటప్పా గల్లీలో తిరిగే గుండా నాకొడుకు అనుకున్నారా? రాథోడ్ విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా? చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ములేక ఆరు నెలలుగా పిచ్చి కుక్కలా నా వెనుకే తిరుగుతంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు మరో పది మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మీసం మీద ఒట్టు అంటూ `విక్రమమార్కుడు`లో రవితేజ సినిమా డైలాగ్ లా చెప్పినా? అలాంటి పోలీస్ ఆఫీసర్ ఒకరు రియల్ లైఫ్ లోనూ ఉన్నాడు. అతడే చౌదరి అస్లామ్ ఖాన్. ఇతడుకి అరెస్ట్ లు చేయడం తెలియదు.
తెలిసిందల్లా ఎన్ కౌంటర్లు చేయడమే. తప్పుడు దారిలో వెళ్లే వారి తాట తీయడమే అతడి ప్రత్యేకత. ఒకేసారి 100కి పైగా గ్యాంగ్ స్టర్లను కాల్చిపడేసిన ఘనత అస్లామ్ ఖాన్ సొంతం. అందుకు గానూ అస్లామ్ ఖాన్ కు ఏడుకోట్లకు పైగా రివార్డు ప్రభుత్వం నుంచి అందింది. ఫేక్ ఎన్ కౌంటర్లు చేస్తున్నారని మీడయా ప్రశ్నిస్తే? ఒక్క మాటలో అందరి నోళ్లు మూయిచాడు. ఫేక్ అని తెలిస్తే అరెస్ట్ చేయండి..జైల్లో పెట్టండని ధైర్యంగా మీడియా ముందుకొచ్చి చెప్పాడు. కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఇదే రిపీట్ అవుద్దని హెచ్చరించాడు.
ఒక్క గ్యాంగ్ స్టర్ ని కూడా వదలనని పాకిస్తాన్, తాలిబన్ల గుండెల్లో నిద్రపోయాడు అస్లమ్ ఖాన్. ఇతడిని చంపడానికి తాలిబన్లు 300 కేజీల బాంబులు తీసుకెళ్లి అస్లామ్ ఖాన్ ఇంటిమీదనే దాడి చేసారు. ఆ దాడికి ఇల్లు కూలింది కానీ..అస్లామ్ ఖాన్ వెంట్రుక కూడా పీకలేపోయారు. దాడి అనంతరం ఎంతో స్టైల్ గా సిగరెట్ తాగూతూ బయటకు నడుచుకుంటూ వచ్చాడు. మరి అంతటి పవర్ పుల్ వ్యక్తి ఎలా చనిపోయాడంటే? కారణం వెన్నుపోటు.
ఆయనతో పాటు పనిచేసిన పోలీసులే సమాచారం అందించడంతో? హతమయ్యాడు. కానీ అస్లామ్ ఖాన్ తన చావు ఎప్పుడోస్తుందో? తెలుసునని కానీ ప్రతీ రోజు కూడా చివరి రోజులాగే గడుపుతానని సహచరలుతో అనేవారు. తాను చేసిన ఎన్ కౌంటర్లను ఎప్పుడూ గుర్తుచేసుకుంటానని...వాటి ఆధారంగా ఓ సినిమా కూడా తీయోచ్చని చెప్పేవారు. ఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్` లో సంజయ్ దత్ పోషించిన పాత్ర అస్లామ్ ఖాన్ దే. కాకపోతే ఆ పోలీస్ పాత్రను మరీ శక్తివంతంగా మలచలేదు. ఓ చాప్టర్ లో చిన్న భాగంగానే చూపించారు. కానీ సినిమాలో ఆ పాత్ర కూడా ఎంతో కీలకమైంది.