లేడీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్సీ: అస్సలు స్కోప్ దక్కట్లేదా ..!
ఈ క్రమంలో నే చంద్రబాబు ఆమెకు మండలిలో అవకాశం ఇచ్చారు. వైసీపీ తరఫున బలమైన గళం వినిపిస్తున్న ఉత్తరాంధ్ర నేతలకు కౌంటర్ ఇస్తారని చంద్రబాబు భావించారు.;
ఆమె ఫైర్ బ్రాండ్. గతంలోనే వైసీపీపై తొడ గొట్టారు. వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ, ఛాన్స్ చిక్కలేదు. ఈ క్రమంలో నే చంద్రబాబు ఆమెకు మండలిలో అవకాశం ఇచ్చారు. వైసీపీ తరఫున బలమైన గళం వినిపిస్తున్న ఉత్తరాంధ్ర నేతలకు కౌంటర్ ఇస్తారని చంద్రబాబు భావించారు. ఆమే.. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ. ప్రస్తుతం మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.
అయితే.. ఆమె అనుకున్నంత రేంజ్‌లో మండలిలో ఆమెకు ఛాన్స్ చిక్కడం లేదని వాపోతున్నారట. తరచుగా ఆమె మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం కనిపించడం లేదని చెబుతున్నారు. ``నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి సర్!`` అంటూ.. ఆమె పదే పదే కోరుతున్నారు. కానీ, అవకాశం ఇలా వచ్చి అలా జారిపోతోందని చెబుతున్నారు. ప్రస్తుతం మండలిలో లడ్డూ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో రగడ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, టీడీపీ సభ్యులు కూడా పైచేయి కోసం ప్రయత్నిస్తున్నారు.
దీంతో తనకు మాట్లాడే అవకాశం వస్తే.. దుమ్ముదులిపేద్దామన్నది గ్రీష్మ.. ఆలోచనగా ఉంది. కానీ, ఆ చాన్నే ఆమె మిస్సవుతున్నారు. దీనికి కారణం.. మంత్రులేనని కూడా ఆమె గుస్సాగా ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీ లేదు. ఆ పార్టీ నాయకులు.. అసెంబ్లీని బాయికాట్ చేశారు. ఉన్నదంతగా.. మండలిలో నే. మండలిలోనే వైసీపీ సభ్యులు గళం వినిపిస్తున్నారు. దీంతో మంత్రులు మొత్తంగా ఇక్కడే తిష్ట వేశారు. దీంతో మంత్రులే ఎక్కువ సమయం తీసుకోవడంతో ఫైర్ బ్రాండ్స్‌కు పెద్దగా అవకాశం రావడం లేదన్నది వాస్తవం.
దీంతో గ్రీష్మ.. ఊసురోమంటున్నారట. ఇటీవల సభలో ఆమె ఏకంగా కులం కార్డును కూడా ప్రయోగించా రు. తాను దళిత సామాజిక వర్గం తరఫున మాట్లాడుతున్నానని తనకు అవకాశం ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు. దీనిపై మండలి చైర్మన్ కస్సు మన్నారు. తాను కూడా దళితుడినేనని.. అంత మాత్రాన మైకు ఇవ్వలేనని.. మంత్రులు ఉండగా.. ఇతర సభ్యులు తగ్గక తప్పదని తేల్చేశారు. దీంతో చేసేది లేక.. గ్రీష్మ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశం ఎప్పుడు వస్తుందోనని ఆమె చెబుతున్నారట.