విద్యార్థులవి డ్రామాలు.. ప‌బ్లిసిటీ కోస‌మే వ‌చ్చారు: ఢిల్లీ పోలీసులు

ఈ వ్య‌వ‌హారంపై విద్యార్థి సంఘాల నాయ‌కులు ఢిల్లీ పోలీసుల‌పై హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌మ ప‌ట్ల కొంద‌రు పోలీసులు అమా నుషంగా ప్ర‌వ‌ర్తించార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

Update: 2026-07-22 16:59 GMT

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ‌ర్వ్యంలో సోమ‌వారం.. చ‌లో పార్ల‌మెంటుకు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తం గా వేలాది మంది విద్యార్థులు ఈ నిర‌స‌న‌లో పాల్గొన్నారు. అయితే.. ఈ నిర‌స‌న హింసాత్మ‌కంగా మారిపోయింది. పోలీసులు విద్యార్థుల‌పై లాఠీల‌తో విరుచుకుప‌డ్డారు. భాష్ప‌వాయు గోళాల‌ను ప్ర‌యోగించారు. జ‌ల ఫిరంగుల‌ను ఎక్కుపెట్టారు. అయిన ప్ప‌టికీ.. విద్యార్థులు వెనుదిర‌గ‌కుండా.. `నీట్ కోసం న్యాయ పోరాటం` పేరుతో ఢిల్లీ వీధుల్లో క‌దం తొక్కారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు-విద్యార్థుల‌కు మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌లో ప‌దుల సంఖ్య‌లో విద్యార్థులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఈ వ్య‌వ‌హారంపై విద్యార్థి సంఘాల నాయ‌కులు ఢిల్లీ పోలీసుల‌పై హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌మ ప‌ట్ల కొంద‌రు పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. తెల్ల‌వారి ప‌లుప‌త్రిక‌ల్లో వ‌చ్చిన ఫొటోల‌ను ఈ సంద‌ర్భంగా న్యాయ స్థానానికి ఇచ్చారు. మ‌హిళా విద్యార్థులప‌ట్ల పోలీసులు ఎలా వ్య‌వ‌హ‌రించారో చూపిస్తూ.. కొన్ని ఫొటోల‌ను కూడా న్యాయ‌మూర్తికి అందించారు. కొంద‌రు పోలీసులు విద్యార్థినుల ప్రైవేటు పార్ట్స్‌పై చేతులు వేయ‌డం.. మెడ‌ల‌ను వంచి వెన‌క్కి విరిచే ప్ర‌య‌త్నం చేయ‌డం.. విద్యార్థినులు అని కూడా చూడ‌కుండా పురుష పోలీసులు లాఠీల‌తో కొట్ట‌డం వంటి ఫొటోలు దీనిలో ఉన్నాయి.

ఈ పిటిష‌న్‌ను విచార‌ణించిన ఢిల్లీహైకోర్టు.. పోలీసుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది. పోలీసులు నిరంకుశ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రి స్తున్నార‌ని వ్యాఖ్యానించింది. అయితే.. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ పోలీసుల త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ.. విద్యార్థులు డ్రామాలు ఆడార‌ని, వారు కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చార‌ని తెలిపారు. అయితే.. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌బ్లిసిటీ కోసం త‌న్నులు తింటారా? మెడ‌లు విరిచేసినా మౌనంగా ఉంటారా? అని ప్ర‌శ్నించారు. పోలీసులు త‌మ హ‌ద్దులు మీరుతున్నార‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చాలా మంది పోలీసులు సివిల్ డ్ర‌స్‌లో వెళ్లి లాఠీ చార్జి ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు.. సుప్రీంకోర్టులోనూ.. మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. పోలీసులు చేసిన లాఠీ చార్జిలో ప‌దుల సంఖ్య‌లో విద్యార్థులు గాయ‌ప‌డ్డార‌ని.. ఈ పిటిష‌న్‌ను త‌క్ష‌ణ‌మే విచారించాల‌ని న్యాయ‌వాది కోరారు. ఈ సంద‌ర్భంగా ప‌లు వీడియోలను కూడా ధ‌ర్మాస‌నానికి అందించారు. అయితే.. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ దీనికి భిన్న‌మైన స‌మాధానం చెప్పారు. ఈ పిటిష‌న్‌పై త‌క్ష‌ణ‌మే విచార‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని, వీడియోలు చూసి తీర్పు చెప్పేంత స‌మ‌యం కూడా త‌మ‌కు లేద‌ని వ్యాఖ్యానించారు. కాగా.. ఢిల్లీ హైకోర్టు మాత్రం సెప్టెంబ‌రు 11వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News