న‌న్నలా పిల‌వొద్దు బ్రో... చిన్న శ్రీను పెద్ద మాట‌!

వైసీపీకి రాజీనామా చేసి.. ప‌ద‌వులు వ‌దులుకుని టీడీపీ పార్టీలోకి వ‌చ్చిన విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస రావు.. తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2026-09-14 06:30 GMT

వైసీపీకి రాజీనామా చేసి.. ప‌ద‌వులు వ‌దులుకుని టీడీపీ పార్టీలోకి వ‌చ్చిన విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస రావు.. తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను `బొత్స మేన‌ల్లుడు` అని పిల‌వ‌ద్ద‌ని మీడియాకు విన్న‌వించారు. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని చెప్పుకొచ్చారు. త‌న‌ను ఇంకా బొత్స మేన‌ల్లుడు అని మీడియా సంబోధించ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానిం చారు. మ‌జ్జి శ్రీను లేదా చిన్న శ్రీను అని సంబోధించాల‌ని.. త‌ను కూడా రాజ‌కీయాల్లో సొంత‌గానే ఎదిగాన‌ని చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో మీడియావారు త‌న‌ను అర్ధం చేసుకోవాల‌ని కోరారు.

ఎందుకు...?

విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయాల్లో వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ బ‌లంగా ఉన్న రోజుల్లో ఆయ‌న‌కు అండ‌గా.. తెర‌మీదికి వ‌చ్చారు మ‌జ్జి శ్రీనివాస‌రావు. ఈయ‌న స్వ‌యానా బొత్స‌కు మేన‌ల్లుడు. తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బొత్స ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ వ‌ర్గంలోనే కాకుండా.. బొత్స రాజ‌కీయాలను కూడా ఈయ‌న తెర‌వెనుక శాసించారనే పేరుంది. దీంతో పాటు బొత్స కుటుంబానికి చెందిన అన్ని వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల‌ను కూడా మ‌జ్జి శ్రీనివాస‌రావు చ‌క్క‌బెట్టారు. ఈ నేప‌థ్యంలోనే బొత్స మేన‌ల్లుడుగా.. గుర్తింపు పొందారు.

ఇదే ఆయ‌న‌కు రాజ‌కీయంగా కూడా గుర్తింపు తెచ్చింది. వైసీపీలో ఆయ‌న‌కు బ‌ల‌మైన గుర్తింపు కూడా తీసుకువ‌చ్చింది. ఆయ‌న పార్టీలో ఉండి ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమిలి నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇచ్చేవార‌ని అంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బాధ్య‌త‌ల‌కు కూడా రిజైన్ చేశారు. ఇక‌, పార్టీ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా స‌మ‌ర్పించారు. అనంత‌రం టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. త‌న కుమార్తె స‌హ‌స్ర‌తో క‌లిసి ఆయ‌న సైకిల్ ఎక్కారు. అయిన‌ప్ప‌టికీ.. ఇంకా కొన్ని మీడియా సంస్థ‌లు.. ఆయ‌న‌ను బొత్స మేన‌ల్లుడుగానే పేర్కొంటున్నాయి. దీంతో ఆయ‌న త‌న‌ను అలా పిల‌వ‌ద్ద‌ని ప్ర‌క‌ట‌న చేశారు.

విజ‌య‌న‌గ‌రంలో మామూలే..

ఇక‌, రాజ‌కీయంగా విజ‌యన‌గ‌రంలో ఉన్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. కుటుంబాల్లోని వారు.. ప‌లు పార్టీల్లో ఉండ‌డం కామ‌న్‌. అయినంత మాత్రాన వారు బంధుత్వాల‌ను వ‌దులుకునే ప‌రిస్థితి లేదు. కానీ.. దూరంగా మాత్రం ఉంటున్నారు. కిమిడి కుటుంబంలోని నేత‌లు ఒకే పార్టీలో ఉన్నా.. నియోజ‌క‌వర్గంలో రాజకీయ విభేదాల కార‌ణంగా బంధుత్వాన్ని వ‌దులుకున్నారు. ఇప్పుడు బొత్స ఫ్యామిలీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Tags:    

Similar News