కెనడా మారింది.. ఇండియన్స్ కు రెడ్ కార్పెట్ పరిచింది..

భార‌త విద్యార్థుల‌కు కెన‌డా ప్ర‌భుత్వం భారీ స్కాల‌ర్షిప్ల‌ను ప్ర‌క‌టించింది. వంద మిలియ‌న్ డాల‌ర్ల స్కాల‌ర్ షిప్ తో పాటు భార‌త యూనివ‌ర్శిటీల‌తో వ్యూహాత్మ‌క ఒప్పందాన్ని ప్ర‌కంటించింది.;

Update: 2026-03-04 14:30 GMT

భార‌త విద్యార్థుల‌కు కెన‌డా ప్ర‌భుత్వం భారీ స్కాల‌ర్షిప్ల‌ను ప్ర‌క‌టించింది. వంద మిలియ‌న్ డాల‌ర్ల స్కాల‌ర్ షిప్ తో పాటు భార‌త యూనివ‌ర్శిటీల‌తో వ్యూహాత్మ‌క ఒప్పందాన్ని ప్ర‌కంటించింది. దీని వెన‌కు కీల‌క వ్యూహం ఉన్న‌ట్టు తెలుస్తోంది. రెండు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క‌, ఆర్థిక‌, జియోపొలిటిక‌ల్ సంబంధాల‌ను పున‌ర్న్మించే ప్ర‌యత్నంగా చూడ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

చాలాకాలంగా భార‌త్, కెన‌డా మ‌ధ్య సంబంధాలు ఆరోగ్యక‌రంగా లేవు. ఈ నేప‌థ్యంలోనే కెన‌డా వ్యూహాత్మ‌క అడుగు వేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. భార‌త విద్యార్థుల‌కు స్కాల‌ర్ షిప్ ల‌ను ప్ర‌క‌టిస్తూ, భార‌త వ‌ర్శిటీల‌తో భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకోవ‌డం కీల‌క‌మైన అడుగు. విద్యారంగంలో భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌డం కెన‌డా సాఫ్ట్ డిప్లొమ‌సీగా పేర్కొన‌వ‌చ్చు. స్కాల‌ర్ షిప్ ఇవ్వ‌డం అంటే కెన‌డా భార‌త‌ టాలెంట్ ను ఆహ్వానించ‌డ‌మే అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం కెన‌డా వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటోంది. నిపుణుల అవ‌స‌రం కెనాడుకు పెరిగింది. దీంతో భార‌త్ ను త‌మ అవ‌స‌రాలు తీర్చే వ‌న‌రుగా కెనడా భావిస్తోంది. అందుకే భార‌త‌ విద్యార్థుల‌కు స్కాల‌ర్ పిష్ లు ప్ర‌క‌టించింది. దీని ద్వారా భార‌తీయుల‌కు కెనడాలో దీర్ఘ‌కాలంలో ఉపాధి, శాశ్వ‌త నివాస అవ‌కాశాలు పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. దీనిని వ‌ల‌స విధానానికి మ‌ద్ద‌తు ఇచ్చే అంశంగా కూడా చూడ‌వ‌చ్చు.

చాలా దేశాలు చైనాపై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించాల‌ని చూస్తున్నాయి. ఎందుకంటే ఒకే దేశంపై ఆధార‌ప‌డితే అది ఎప్పుడైనా రిస్కే. రిస్క్ డైవ‌ర్షిఫికేష‌న్ లో భాగంగా భార‌త్ ను త‌మ రెండో కీల‌క భాగ‌స్వామిగా చూడాల‌నుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ, సెమికండ‌క్ట‌ర్స్, టెక్నాల‌జీ రంగాల్లో భార‌త్ ను కీల‌క భాగ‌స్వామిగా మార్చుకోవాల‌న్న ఆలోచ‌న కెనడాకు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే భార‌త వ‌ర్శిటీల‌తో కెన‌డా కీల‌క ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇది కెన‌డా రిస్క్ ను త‌గ్గిస్తుంది. అదే స‌మ‌యంలో భార‌త్ కు విదేశీ పెట్టుబడి వ‌స్తుంది. భార‌త విద్యార్థుల‌కు గ్లోబ‌ల్ ఎక్స్పోజ‌ర్ పెరుగుతుంది. సంయుక్త ప‌రిశోధ‌న ద్వారా ల‌బ్ధి జ‌రుగుతుంది. కానీ టాలెంట్ దేశాన్ని వీడిపోతుంది. సొంత ప‌రిశోధ‌నా రంగం వెన‌క‌బడుతుంద‌న్న వాద‌న ఉంది. కెన‌డా విధానాలు విద్యా స‌హ‌కారం, తద్వారా నైపుణ్య లోటును అధిగ‌మించ‌డం, జియో పొలిటిక‌ల్ వ్యూహంలో భాగంగా రిస్క్ త‌గ్గించుకునే కోణంలో చూడ‌వ‌చ్చ‌న్న విశ్లేష‌ణ ఉంది.

ఇండియా కెన‌డా మ‌ద్య ఉన్న స‌మ‌స్య‌లేంటి ?

కెనడా అధ్య‌క్షుడు జ‌స్టిన్ ట్రుడో బాధ్య‌త‌లు చేప‌ట్టాక భార‌త్, కెన‌డా మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. కెన‌డా త‌మ దేశంలో ఖ‌లిస్థాన్ ఉద్య‌మ‌కారుల‌ను ప్రోత్స‌హిస్తుంద‌న్న ఆరోప‌ణ భార‌త్ చేస్తోంది. 2023లో ఖ‌లిస్థాన్ ఉద్య‌మ‌కారుడు హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ హ‌త్య‌గావించ‌బ‌డ్డాడు. దీని వెనుక‌ భార‌త ఏజెంట్ల హ‌స్తం ఉంద‌న్న వాద‌న కెన‌డా చేసింది. అప్ప‌టి నుంచి ఇరుదేశాల మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. ఖ‌లిస్థాన్ వాదుల‌కు కెన‌డా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం త‌మకు వ్య‌తిరేక‌మ‌ని భార‌త్ భావిస్తోంది. అదే స‌మ‌యంలో కెన‌డా అది ప్ర‌జాస్వామ్య హక్క‌ని మాట్లాడుతోంది. కెన‌డా ఖ‌లిస్థాన్ వేర్పాటువాదులకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వెనుక స్థానిక రాజ‌కీయాలే కార‌ణం అన్న విశ్లేష‌ణ ఉంది.

Tags:    

Similar News