దేశ రక్షణరంగాన్ని మార్చే ‘అదానీ’బిగ్ ప్లాన్
వచ్చే ఏడాది నుంచి ఈ ప్రణాళికలు పట్టాలెక్కనున్నాయి. ఈ పెట్టుబడుల ప్రధాన ఉద్దేశం.. ఆదానీ డిఫెన్స్ అండ్ హీరోస్పేస్ దృష్టి సారించిన కొన్ని కీలక రంగాలు ఉన్నాయి.;
గౌతమ్ అదానీ.. భారత దేశపు అత్యంత ధనవంతుల్లో ఒకరు.. అలాగే మోడీకి సన్నిహితమైన వ్యాపారవేత్తల్లో కూడా ఈయన ముఖ్యుడు..దేశంలో చాలా ప్రభుత్వ కాంట్రాక్టులు పోర్టులు కైవసం చేసుకుని తన వ్యాపారాన్ని వృద్దిలోకి తీసుకొచ్చిన ఘనుడు ఈయన.. ఇప్పుడు దేశానికి అవసరమైన మరో కీలకమైన రంగంలోకి గౌతం అదాని అడుగు పెట్టనున్నాడు . భారతదేశాన్ని రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఆత్మ నిర్భర భారత్ దిశగా మోడీ కలను సహకారం చేసేందుకు ఆదాని గ్రూప్ భారీ కార్యాచరణను ప్రకటించింది. దేశ రక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా అత్యధిక సాంకేతికతతో ప్రపంచ స్థాయి ఆయుధాలను తయారు చేసేందుకు ఏకంగా రూ.1. 80 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రణాళికలు పట్టాలెక్కనున్నాయి. ఈ పెట్టుబడుల ప్రధాన ఉద్దేశం.. ఆదానీ డిఫెన్స్ అండ్ హీరోస్పేస్ దృష్టి సారించిన కొన్ని కీలక రంగాలు ఉన్నాయి.
అత్యాధునికత సాంకేతికతపై అదానీ ఫోకస్..
సంప్రదాయ యుద్ధ పద్ధతుల కంటే భిన్నంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అదాని గ్రూప్ కొన్ని కీలకమైన పరిశోధనలను తయారీని చేపట్టనుంది. ముఖ్యంగా మానవ రహిత వాహనాలను తయారు చేసేందుకు దృష్టి సారించనుంది. ఆకాశంలో నిఘా దాడులకు ఉపయోగపడే ఆత్యాధునిక డ్రోన్లను కూడా తయారు చేయడానికి ముందుకొచ్చింది. శత్రువుల లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే క్షిపణులు ఆయుధ వ్యవస్థలు తయారు చేయనుంది. అలాగే సరిహద్దుల్లో నిఘా పెంచేందుకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తయారు చేయడానికి సిద్ధమైంది.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి యుద్ధ రంగంలో నిర్ణయాలు తీసుకోవడం సైనికుల ప్రాణాపాయాన్ని తగ్గించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
నౌకాదళంలో ‘దృష్టి 10’ దూకుడు
అదానీ గ్రూప్ ఇప్పటికే రక్షణ రంగంలో తన ఉనికిని చాటుకుంది. సంస్థ తయారు చేసిన దృష్టి 10 స్టార్ లైనర్ యూఏవీలు ప్రస్తుతం భారత నౌకాదళంలో కీలక సేవలు అందిస్తున్నాయి. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగల సామర్థ్యం కలిగి ఉండడం విశేషం.
ప్రాణనష్టం తప్పించే ఆయుధాల తయారీ..
అదా నీ గ్రూప్ ఈ పెట్టుబడుల ద్వారా కేవలం ఆయుధాలనే కాకుండా ఏఐ రోబోటిక్ సహాయంతో యుద్ధరంగంలో సైనికులకు ఎదురయ్యే ముప్పును తగ్గించాలని భావిస్తోంది. రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా మానవ వనరుల నష్టాన్ని కనిష్ట స్థాయికి తీసుకురావాలన్నది అధానీ సంస్థ ముఖ్య ఉద్దేశం.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆదాని గ్రూప్ దక్షిణాసియాలోని అతిపెద్ద మందు గుండు సామాగ్రి, క్షీపణుల తయారీ కాంప్లెక్స్ ను ప్రారంభించింది ఇది దేశీయ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది. భారత రక్షణ రంగం ప్రైవేటు భాగస్వామ్యంతో బలోపేతం అవుతున్న ఈ తరుణంలో ప్రధాని గ్రూప్ చేయబోయే ఈ భారీ పెట్టుబడుల ద్వారా దేశ రక్షణ ఎగుమతులను పతాక స్థాయికి తీసుకెళ్తాయని.. భారత్ ను అగ్రస్థానంలో నిలిపే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.