తమిళనాడులో విజయ్ ప్రభంజనం… కింగ్ అవుతారా? కింగ్ మేకరా?
తమిళనాడు రాజకీయాల్లో ఈసారి అసలు ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. సాంప్రదాయకంగా డీఎంకే–ఏఐ డీఎంకే మధ్యనే పోరు జరుగుతుంటే.. ఈసారి మాత్రం సినీ నటుడు విజయ్ కోసం టీవీకే ఊహించని రీతిలో రాజకీయ సమీకరణలను మార్చేస్తోంది.;
తమిళనాడు రాజకీయాల్లో ఈసారి అసలు ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. సాంప్రదాయకంగా డీఎంకే–ఏఐ డీఎంకే మధ్యనే పోరు జరుగుతుంటే.. ఈసారి మాత్రం సినీ నటుడు విజయ్ కోసం టీవీకే ఊహించని రీతిలో రాజకీయ సమీకరణలను మార్చేస్తోంది.
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం అధికార డీఎంకే 50కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా ప్రతిపక్ష అన్నాడీఎంకే 69కి పైగా స్థానాల్లో అధికారం చూపుతోంది. అయితే అసలు గేమ్‌చేంజర్‌గా టీవీకే నిలుస్తోంది. విజయ్ పార్టీ 103కి పైగా స్థానాల్లో తమిళ రాజకీయాల్లో భారీ సంచలనంగా మారింది. 118 మ్యాజిక్ ఫిగర్ గా తమిళనాట ఉంది. ఇప్పటికే విజయ్ 103 స్థానాలు గెలుచుకోవడంతో అధికారంలోకి టీవీకే విజయ్ రావడం ఖాయమని.. విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
* విజయ్ కింగ్ అవుతారా? లేక కింగ్ మేకర్‌గా నిలుస్తారా?
సంఖ్యా బలం దృష్ట్యా టీవీకే స్వతంత్రంగా పూర్తి మెజారిటీ వస్తుందా? లేదా? అన్నది చూడాలి. అయితే డీఎంకే అన్నాడీఎంకే తో పాటు ఏ పార్టీకి లేదా స్పష్టమైన మెజారిటీ రాకపోతే విజయ్ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు తప్పనిసరి అవుతుంది.
ఒకవేళ విజయ్ తన పార్టీని కూటమిలోకి తీసుకెళ్లి ముఖ్యమంత్రి పదవి కోరితే, రాజకీయంగా పెద్ద మార్పు సంభవించొచ్చు. కానీ ఆయన బయట నుంచి మద్దతు ఇస్తే మాత్రం “కింగ్ మేకర్”గా నిలిచే అవకాశం ఎక్కువ.ఇక ప్రజల మద్దతు.. యువత ఆకర్షణ విజయ్‌కు బలమైన బలం, పాలన అనుభవం లేకపోవడం ఒక సవాల్‌గా మారొచ్చు. అదే సమయంలో సంప్రదాయ పార్టీలపై వ్యతిరేకతను విజయ్ బలంగా చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి తమిళనాడులో ఈసారి ఫలితాలు కేవలం ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అన్నదానికే కాదు... కొత్త రాజకీయ శకం ప్రారంభమవుతుందా అన్నదానికీ సూచనలివ్వబోతున్నాయి. విజయ్ నిజంగా “కింగ్” అవుతారా? లేక రాజకీయ చెస్‌లో కీలకమైన “కింగ్ మేకర్”గానే నిలుస్తారా? అన్నది తుది ఫలితాల తర్వాత స్పష్టతకు రానుంది.