• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గుడ్ న్యూస్: ఒమిక్రాన్...

గుడ్ న్యూస్: ఒమిక్రాన్ విరుగుడుకు మందు..: ఫైజర్ ప్రయత్నాలు సక్సెస్

By - Tupaki Desk
Update: 2021-12-15 08:30 GMT
ప్రపంచాన్ని మరోసారి ఒమిక్రాన్ భయపెడుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజల శరీరాల్లోకి వెళుతోంది. దక్షిఫ్రికాలో మొదలైన ఈ కేసులు ఇప్పటి వరకు 77 దేశాలకు విస్తరించింది. దీంతో మరిన్ని దేశాలకు విస్తరించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు వైద్య నిపుణులు. కరోనా మొదటి వేరియంట్ ను తట్టుకోవడానికి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటున్నా ఒమిక్రాన్ సోకడం కలకలం రేపుతోంది. మొన్నటి వరకు ఒమిక్రాన్ వ్యాప్తి మాత్రమే ఉంటుందని, మరణాలు ఉండవని అనుకున్నారు. కాని ఇంగ్లాండ్లో ఒమిక్రాన్ మరణం నమోదు కావడంతో మరోసారి ఆందోళన వాతావరణం ఏర్పడింది. అయితే ఈ తరుణంలో ఒమిక్రాన్ కు ఎదుర్కొనేందుకు కొత్త మందును కనిపెట్టారు. ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

అమెరికా ఫర్మాన్యూటికల్ కంపెనీ ఫైజర్  ఒమిక్రాన్ బారిన పడ్డవారికి శుభవార్త తెలిపింది.  కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తాము చేసిన పరిశోధనలు మంచి ఫలితాలనిచ్చాయని చెప్పింది. ఒమిక్రాన్ వైరస్ ను తట్టుకునేందుకు యాంటీ వైరల్ ట్యాబ్లెట్లను రూపిందించింది.అంతేకాకుండా ఇప్పటికే దీనిని 2వేల 250 మందిపై ప్రయోగించామని ఫైజన్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. వీరి నుంచి సానుకూల ఫలితాలు వచ్చాయంటున్నారు పరిశోధకులు. అయితే వైరల్ తీవ్రత ఉండి లక్షణాలు తీవ్రంగా ఉంటేనే దీనిని వాడే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు ఈ టాబ్లెట్ తో మరణాల శాతం కూడా 89 శాతానికి తగ్గిందని అంటున్నారు.

ఈ టాబ్లెట్ తయారు చేయడానికి ముందుగా వివిధ పరిశోధనలు చేశారు. ఆ తరువాత ఓ ప్రయోగం ఫలించింది. పునరుత్పత్తి కోసం ఒమిక్రాన్ వేరియంట్లోని కీలక ప్రొటీన్ ను కృత్రిమంగా తయరాు చేసిన ఈ టాబ్లెట్ ను ప్రచయోగించారు. దీతో మంచి ఫలితాలిచ్చాయి. ఆ తరువాత మరింత మందికి ఇచ్చారు. ఇలా 2 వేల 250 మందికి వీటిని ఇవ్వగా వారి నుంచి మంచి రిజల్ట్స్ వచ్చాయని వైద్య పరిశోధకులు తెలిపారు. అయితే దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ బోర్డు ఆమోదించాల్సి ఉంది.

ఫైజర్ నుంచి ఇప్పటికే మొదటి వేరియంట్ ను తట్టుకునేందుకు వ్యాక్సిన్ తయారు చేశారు. అందరి కంటే ముందుగానే దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలోనూ ఫైజర్ టాబ్లెట్ తయారు చేసింది. అయితే ఇది రాను రాను ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. మరోవైపు ఒమిక్రాన్ వాతావరణ పరిస్థితులను భట్టి మారుతుందని అంటున్నారు. ఇంకోవైపు దీని తీవ్రత ఇంకా మొదలు కాలేదని, దానికి సమయం పడుతుందని అంటున్నారు. అయితే  మరణాలు పెరిగితే ఒమిక్రాన్ తీవ్రత మొదలైందని భావిస్తారు. ఆ సమయంలో టాబ్లెట్ పనిచేస్తుందా..? లేదా..? చూడాలి.

ఇదిలా ఉండగా ఆయా దేశాలో వ్యాక్సిన్లు వందశాతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇండియాలో వైద్యారోగ్య శాఖకు టార్గెట్ పెట్టి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రజలు పనిచేసే చోటుకు వెళ్లీ మరీ టీకా అందిస్తున్నారు. వ్యాక్సిన్ పూర్తయితేనే ఒమిక్రాన్ ను ఎదుర్కోగలమని అంటున్నారు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం ఇది సోకడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఒమిక్రాన్ తన రూపు మార్చుకుంటే మాత్రం ఫైజర్ టాబ్లెట్ అవసరం పడుతుందా..? అని చర్చించుకుంటున్నారు.
 
అయితే ఇప్పటికే ఒమిక్రాన్ సోకకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కొందరు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. భారత్లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. స్వల్ప లక్షణాలున్నా మరణాలు సంభవిస్తే ఏం చేయాలి..? అన్న దానిపై ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. మరోవైపు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మాస్క్ లేకపోతే రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటించడమే మనకు అసలైన మందు అని అంటున్నారు.
Tags:    
  • Omicron 
  • covid 
  • Booster Dos 
  • pfizer 
  • Antidote 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS