ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీ కాదా? ‘రెడ్డి వర్సెస్ కమ్మ’నా?

Update: 2020-08-28 18:00 GMT
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో రెడ్డి డామినేషన్ ఉండేది. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కమ్మ డామినేషన్ కాంగ్రెస్ లో ఉండేది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పురంధేశ్వరి, రాయపాటి, లగడపాటి, కావూరి ఇలాంటి పారిశ్రామికవేత్తలు పార్టీలో ఉన్నారు. అలాగే టీడీపీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుంచి భూమా నాగిరెడ్డి వరకు ఎందరో రెడ్లు ఉండేవారు. కానీ విడిపోయిన ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీల్లో పరిస్థితి వేరుగా ఉంది.
 
2015 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తరువాత లోకేష్ పెత్తనం మొదలైందంటారు. ఆయనకు దగ్గరగా ఉండే కొంతమంది కమ్మ యువ నేతలు తప్పుడు సలహాలు ఇవ్వడం వలన టీడీపీని అంటిపెట్టుకొని ఉన్న రెడ్డి సామాజికవర్గ నేతలంతా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి దూరంగా జరిగారు. అందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వైఎస్ జగన్ వెంట వెళ్లిపోయారు.

ముఖ్యంగా రాయలసీమ - నెల్లూరు - ప్రకాశం - గుంటూరు - పల్నాడు ప్రాంతంలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో లోకేష్ పవర్ ను అడ్డుపెట్టుకొని రెడ్లను పట్టించుకోకుండా క్రూరత్వం ప్రదర్శించారు అని టీడీపీలోనే కొందరు చెప్పుకొనేవారు . అది వైసీపీ క్యాష్ చేసుకొని ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో క్షేత్రస్థాయిలో ముఖ్యంగా కుల రాజకీయాలను బాగా చేశాడని సమాచారం. ప్రాంతాలను విభజన చేసుకొని మరీ ఆ ప్రాంతాల్లో కులాలను డివైడ్ చేసి బాగా నూరి పోసి కమ్మ డామినేషన్  ఏ విధంగా ఉందో.. రాయలసీమలో అలా రెడ్లను రెచ్చగొట్టి తమవైపు తిప్పుకున్నారట..  గోదావరి జిల్లాల్లో కమ్మ వర్సెస్ కాపు.. ఉత్తరాంధ్రలో బీసీలను చీల్చి ఇలా ప్రయోగాలు చేశారంట.. అందుకే వైఎస్ జగన్ విజయం సాధించారనే టాక్ విశ్లేషకుల నుంచి వినపడింది.
 
 కానీ ఇప్పుడు జగన్ సీఎం అయిన తరువాత సీఎంవో ఆఫీస్ లో అంతా రెడ్డి సామాజికవర్గం వాళ్లనే పెట్టుకున్నాడని లోకేష్ ట్విట్టర్ లో ఊదరగొడుతున్నాడు. కానీ ఆ రోజు లోకేష్ కూడా ఇదే చేశాడని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.    ఇప్పుడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా ఓట్లేసి గెలిపించిన గ్రామాల్లోని రెడ్లకు న్యాయం జరగడం లేదని వారంతా వాపోతున్నారు. అప్పుడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామాల్లోని కమ్మ వాళ్లకు న్యాయం జరగలేదని.. అందుకే 2019 ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గంలోని 40శాతం మంది వైసీపీకి ఓట్లు వేశారని టాక్. వైఎస్ఆర్ ను చూసి పాత గుర్తులతో జగన్ ను గెలిపించారని చెబుతున్నారు.

అలాగే ఈరోజు రెడ్డి సామాజికవర్గం నేతలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. గ్రామాల్లో పేదరికంతో మగ్గిపోతున్నా రెడ్లను పట్టించుకోవడం లేదు అని అంటున్నారు.   ఇలానే ఉంటే రేపు వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా టీడీపీ గతే పడుతుందని.. రెడ్డి సామాజికవర్గం నుంచి టీడీపీకి 30-40 శాతం ఓట్లు చీలే పరిస్థితి ఉందని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.

మొత్తంగా ఏపీలో రాజకీయం అంతా కులాల వారీగా చీలిపోయారని.. కానీ ఇందులో సామాన్యులు బలి అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.ఇది  రాష్ట్రానికి కూడా మంచిది కాదు అని సూచిస్తున్నారు.
Tags:    

Similar News