• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉక్రెయిన్ కు అమెరికా 100...

ఉక్రెయిన్ కు అమెరికా 100 స్విచ్ బ్లేడ్లు

By - Tupaki Desk
Update: 2022-03-18 09:33 GMT
ఉక్రెయిన్ కు అమెరికా ఆత్మాహుతి డ్రోన్ల ను అందిస్తోంది. దీనికే స్విచ్ బ్లేడ్ అని పేరుంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు అమెరికా నుంచి అనేక రకాల ఆయుధాలు, ఆయుధ సామగ్రి అందింది. వీటికి అదనంగా తొందరలోనే స్విచ్ బ్లేడ్లు అందబోతున్నాయి. దీంతో శతృవుల యుద్ధ ట్యాంకులు,  తక్కువ ఎత్తులో ఎగిరే యుద్ధ విమానాలతో పాటు ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేసేయచ్చు.

దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శతృవుల కదలికలను, వాళ్ళ కాన్వాయ్ ని కూడా స్విచ్ బ్లేడ్ డ్రోన్ల ద్వారా పసిగట్టేయచ్చు. వెంటనే వీటిని దూరం నుండే శతృవులపైకి ప్రయోగించటానికి వీలవుతుంది.  అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్ధ స్విచ్ బ్లేడ్ 300, స్విచ్ బ్లేడ్ 600 అనే రెండురకాల ఆత్మాహుతి ద్రోన్లను తయారుచేసింది.  ఇవేమీ ఇపుడు కనబడుతున్న  న్లంత పెద్దవిగా ఉండవు. చాలా చిన్నగా ఎంతంటే ప్యాంటు బ్యాక్ పాకెట్లో కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోవచ్చు.

వీటిని గాల్లోకి ప్రయోగించగానే శతృవుల కదలికలను గమనిస్తుంటాయి. ఒకసారి కదలికలను పసిగట్టగానే వెంటనే కంట్రోల్ యూనిట్ కు సంకేతాలను పంపుతాయి. కంట్రోల్ యూనిట్ నుండి సిగ్నల్ అందగానే వెంటనే దాడిచేస్తాయి.  ముందు ప్రయోగించినపుడు మామూలుగానే ఉన్నా గాల్లో లేచిన తర్వాతే బ్లేడ్లు తెరుచుకుంటాయి. అందుకనే వీటిని స్విచ్ బ్లేడ్లని అంటున్నారు. ఇవి యుద్ధ ట్యాంకులను కూడా పేల్చేయగలవు. స్విచ్ బ్లేద్ బరువు కేవలం 2.5 కిలోలు మాత్రమే ఉంటుంది. 10 కిలోమీటర్ల టార్గెట్లను  కూడా చాలా ఈజీగా ఛేదిస్తాయి.

గతంలో వీటిని ఆఫ్ఘనిస్ధాన్లో అమెరికా సైన్యం తాలిబన్లపైన  ఉపయోగించింది. కొండల్లో పర్వతాల్లో ఎక్కడెక్కడో దాక్కునుండే తాలిబన్లను గుర్తించి సిగ్నల్ ఇచ్చేందుకు, ఆదేశాలు రాగానే దాడులు చేసేందుకు స్విచ్ బ్లేడ్లు బాగా ఉపయోగపడ్డాయి. స్విచ్ బ్లేడ్ ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. ఇపుడు ఉక్రెయిన్ కు ఇవ్వబోతోంది. ఇప్పటికే 800 స్టింగర్ క్షిపణులను, దాదాపు 2 కోట్ల చిన్న ఆయుధాలు, 25 వేల శరీర కవచాలు, 25 వేల హెల్మెట్లు, 100 రాకెట్ లాంచర్లు, 5 వేల రైఫిల్స్, 400 మిషన్ గన్లు, 400 షాట్ గన్లను అమెరికా అందించింది. వీటికి అదనంగా 100 స్విచ్ బ్లేడ్లను కూడా అందిచబోతోంది.
Tags:    
  • americaa 
  • helps 
  • ukrine 
  • US supplies suicide drones to Ukraine 
  • switch blade 
  • for ukrine russia war 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS