లక్ష్మీపార్వతిపై ఆరోపణల కేసు.. కొత్త మలుపు

Update: 2019-04-15 09:55 GMT
లక్ష్మీపార్వతి తనపై దుష్ప్రచారం చేసిన తన మాజీ సహాయకుడు కోటిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేసింది. కోటితో పాటు మరో యువకుడు సోషల్ మీడియాతో తనను అభాసుపాలు చేస్తున్నారని లక్ష్మీ పార్వతి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న కోటిని తన సొంత బిడ్డలా చూశానని.. అతడి వెనుక ఎవరో ఉండి కుట్ర పన్నారని.. దాన్ని ఛేదించాలని పోలీసులను లక్ష్మీపార్వతి కోరారు. తన పరువు, మర్యాదలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని ఆమె డీజీపీకి విజ్ఞప్తి చేశారు..

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు కొద్దిరోజుల ముందు లక్ష్మీపార్వతి సహాయకుడు గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి అనే వ్యక్తి సంచలనం సృష్టించాడు. లక్ష్మీపార్వతి తనను వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మానసికంగా లైంగికంగా వేధిస్తోందని ఆరోపించాడు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది.

అయితే దీనిపై లక్ష్మీపార్వతి, వైసీపీ శ్రేణులు ఖండించాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలతో లక్ష్మీ పార్వతికి వచ్చిన సానుభూతిని తొలగించడానికే టీడీపీ ఈ కుట్రలు పన్నిందని ఆరోపించారు. ఇప్పుడు కోటి అనే వ్యక్తి వెనుకల టీడీపీ నేతలున్నారని.. దీనిపై నిజాలు నిగ్గుతేల్చాలని లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
    

Tags:    

Similar News