• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సాఫ్ట్ వేర్ల ప్రేమ పగలా...

సాఫ్ట్ వేర్ల ప్రేమ పగలా మారింది ఎందుకు? ఇద్దరి చావుకు కారణమేంటి?

By - Tupaki Desk
Update: 2022-05-10 07:30 GMT
నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామానికి చెందిన కావ్య, సురేష్ లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. సురేష్ బెంగళూరులో, కావ్య పుణేలో ఉద్యోగం చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ బెంగళూరులోనే కలిసి పనిచేశారు. అప్పుడే కావ్యను చూసి ఇష్టపడ్డాడు సురేష్. అయితే కావ్య పెద్దగా పట్టించుకోలేదు. కావ్య పుణేకు వెళ్లాక సురేష్ లో ప్రేమ ఎక్కువైంది. అనంతరం వర్క్ ఫ్రం హోంతో తన ఊరికే రావడంతో ఆమె కోసం పరితపించాడు. కావ్యను పెళ్లిచేసుకుంటానని సురేష్ తన కుటుంబంతో అడిగించినా ఆమె నిరాకరించింది. దీంతో కసితో రగిలిపోయి కావ్యను చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు.

సురేష్ ను కావ్య పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటన్నది వారి బంధువుల ద్వారా బయటపడింది.  సురేష్ వయసు 35 సంవత్సరాలు కాగా.. కావ్య వయసు కేవలం 22 ఏళ్లే. అందుకే ఈ భారీ వయసు తేడా వల్లనే పెళ్లికి అంగీకరించలేదని తెలిసింది. కావ్యకు ఇష్టమైతే పెళ్లికి అభ్యంతరం లేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. కానీ సురేష్ వయసు ఎక్కువ కావడం.. పైగా ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే కావ్య అతడి పెళ్లి ప్రపోజల్ ను తిరస్కరించినట్టు బంధువులు తెలిపారు. అదే పగగా మారి ఆమెను చంపి అతడు చనిపోవడానికి దారితీసిందని చెబుతున్నారు.

తనను పెళ్లి చేసుకోవడం లేదని కక్ష గట్టి తోటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావ్యను తుపాకీతో కాల్చి చంపాడు టెక్కీ సురేష్.  నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ హత్య సంచలనమైంది. ప్రేమించడం లేదని..పెళ్లికి నిరాకరించిందని కావ్యను సురేష్ కాల్చి.. తనకు తాను కాల్చుకొని చనిపోయాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి మృతదేహాలను నెల్లూరు జీజీహెచ్ కు తరలించారు. ఉదయం 10 గంటలకు కావ్య, సురేష్ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన సురేష్ కు అమెరికా తయారు చేసిన తుపాకీ ఎలా వచ్చిందన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. పోలీసులు ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. సురేష్ ఫోన్ కాల్స్, మెసేజ్ ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. సురేష్ రెడ్డి వద్ద ఎప్పటి నుంచి పిస్టోల్ ఉంది. రెండు మ్యాగజైన్స్ బుల్లెట్లు ఎక్కడివి అనేవి ప్రస్తుతం అనుమానంగా మారింది.

సురేష్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో అక్కడి నుంచి పిస్టోల్ తీసుకువచ్చాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తుపాకీపై 'మేడ్ ఇన్ యూఎస్ఏ' అని ఉండడంతోపాటు స్టార్ గుర్తును పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే కావ్యను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

ఇక యువ టెక్కీ కావ్య హత్యతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. కావ్య, సురేష్ మృతదేహాలకు ఈరోజు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న అక్కసుతో  ప్రేమించిన యువతిని యువకుడు సురేష్ కాల్చి చంపాడు.
Tags:    
  • SureshReddy 
  • Kavya 
  • SoftwareEngineers 
  • Bengaluru 
  • NelloreDistrict 
  • Tatipatri 
  • Pune 
  • Gun 
  • Police 
  • Murder 
  • TupakiExclusive 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS