• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాహుల్ పై అదిరిపోయే పంచ్...

రాహుల్ పై అదిరిపోయే పంచ్ వేసిన మోడీ

By - Tupaki Desk
Update: 2016-12-22 07:43 GMT
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టైం ఏమాత్రం బాగోలేదన్నట్లుగా ఉంది. తొందరపడి మాట్లాడితే ఎన్ని తిప్పలన్న విషయం ఆయనకు అర్థమయ్యేలా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు. ఉత్త పుణ్యానికి తనతో పెట్టుకుంటే ఎంత రచ్చ అవుతుందో అర్థమయ్యేలా ఆయన పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్నారు. ప్రధాని మోడీకి సంబంధించిన బలమైన ఆధారాలతో ఒక విషయం తన దగ్గర ఉందని.. తాను కూడా ఆ వివరాల్ని బయటపెడితే భూకంపం వస్తుందని రాహుల్ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీపై ఇంత ఘాటుగా విరుచుకుపడని రాహుల్.. ఉన్నట్లుండి మాట్లాడటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆయన చేసిన వ్యాఖ్యలపై పడ్డాయి. తాజాగా మోడీపై ఆయన తన ఆరోపణల్ని వెల్లడించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యాపారవేత్తలు (సహారా.. అదిత్య బిర్లా) మోడీకి రూ.40కోట్లు ముడుపులు ఇచ్చారని ఆరోపించారు.

అయితే.. ఈ ఆరోపణలకు సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు కొట్టిపారేశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో.. రాహుల్ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయి.. ఆయనపై అందరూ జోకులు వేసుకునే పరిస్థితి. ఇలాంటి వేళ.. ప్రధాని మోడీ నోరు విప్పారు. తనపై 125 కోట్ల మంది ప్రజలకు నమ్మకం ఉందని.. కానీ.. ఒక యువనేత ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకున్నారని.. ఆయన మాట్లాడటం నేర్చుకున్నందుకు తన ఆనందానికి హద్దుల్లేకుండా ఉందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

‘‘మనకు కొందరు యువ రాజకీయ నేతలు ఉన్నారు. ఒక యువ రాజకీయ నేత ఎలా మాట్లాడాలో నేర్చుకుంటున్నారు. ఆయన మాట్లాడటం ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఉపన్యాసాలు ఎలా ఇవ్వాలో నేర్చుకుంటున్నారు. నా ఆనందానికి హద్దుల్లేకుండా ఉంది. అయితే.. ఆయన మాటలకు భూకంపం రాలేదని సంతోషంగా ఉంది’’ అంటూ రాహుల్ పేరు ఎత్తకుండానే ఎన్ని చురకలు వేయాలో అన్ని చురకలు వేసేశారు మోడీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Narendra Modi 
  • Rahul Gandhi 
  • Telugu NEWs 

Similar News

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS