టీడీపీ ఓటమిపై లోకేష్ ఏమన్నాడంటే.?

Update: 2019-05-27 04:50 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్నడూ లేనంతా దారుణంగా టీడీపీ ఓడిపోయింది. టీడీపీ అధినేత కుమారుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా గెలవని పరిస్థితి. చంద్రబాబు, పార్టీ నేతలంతా హతాషులై చూస్తున్నారు. ఈ దారుణ ఓటమిపై నారా లోకేష్ తొలిసారి స్పందించారు. ట్విట్టర్ లో మోముపై చిరునవ్వును చూపిస్తూనే టీడీపీ నేతలు కలిసినప్పుడు దిగిన ఫొటోలను యాడ్ చేసి ఈ మెసేజ్ పోస్ట్ చేశాడు.

నారా లోకేష్ తన పార్టీ శ్రేణులకు - టీడీపీ నాయకులకు కర్తవ్యబోధ చేశారు. మరింత బాధ్యతో పనిచేయాలని హితవు పలికారు. ఫలితాలపై విశ్లేషణ తర్వాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందామని ధైర్యం చెప్పారు. ప్రజలు ఎవరికి ఓటు వేసినా సరే తన మాట మారదని స్పష్టం చేశారు.

టీడీపీ కార్యకర్తలకు నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. కష్టం - నష్టం - సంతోషం - సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణమంటూ లోకేష్ బాబు ఎమోషన్ అయ్యారు. ఎన్నికలు ఐదేళ్లకోసారి వచ్చి అధికారం మారినా.. తన అనుబంధం మాత్రం టీడీపీ కార్యకర్తలతో ఆగదన్నారు. మంగళగిరిగిలో ఓడిపోయానా.. ఇది తన ఇల్లు అని.. ఇక్కడి ప్రజలంతా నా కుటుంబమని లోకేష్ బాబు చెప్పుకొచ్చాడు. గెలిచినా.. ఓడినా ఇక్కడ ప్రజలతో ఉంటానని చెప్పుకొచ్చాడు.

మే 23న ఫలితాలు వెలువడ్డాయి. చంద్రబాబు అదే రోజు రెండు నిమిషాల పాటు ప్రెస్ మీట్ కు హాజరై జగన్ కు శుభాకాంక్షలు చెప్పి సైలెంట్ అయిపోయారు. తాజాగా నాలుగు రోజులకు లోకేష్ బాబు జనంలోకి వచ్చి ఈ ప్రకటన చేయడం విశేషం.


Tags:    

Similar News