లక్షల కోట్లు...జాబ్స్ నిల్...ఏంది ఈ గోల !

అవును నిజమే కదా. ఏ రాష్ట్రం చూసినా ఏమున్నది గర్వకారణం అంటే లక్షల కోట్ల పెట్టుబడులు ఇట్టే వచ్చేస్తున్నాయి.;

Update: 2025-12-10 14:30 GMT

అవును నిజమే కదా. ఏ రాష్ట్రం చూసినా ఏమున్నది గర్వకారణం అంటే లక్షల కోట్ల పెట్టుబడులు ఇట్టే వచ్చేస్తున్నాయి. అంతే కాదు రెండు రోజుల సమ్మిట్ పెడితే చాలు ఇన్వెస్టర్లు వెల్లువలా తరలి వస్తున్నారు. వేల కోట్ల పెట్టుబడులతో ఆ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ప్రతీ ఒక్క ప్రాజెక్టు విషయంలోనూ ఎన్నో జాబ్స్ వస్తాయని పాలకులు చెబుతున్నారు. అయితే నిజంగా అలాగే జరుగుతోందా అసలు ఈ పెట్టుబడులు సదస్సులు ఏమిటి అందులో గ్రౌండ్ అయ్యేవి ఎన్ని అసలు కొసరు తీసేస్తే జాబ్స్ అని వచ్చేవి ఎన్ని అన్నది అంతటా సాగుతున్న చర్చగా ఉంది.

ఎన్ని సమ్మిట్స్ చూడలేదు :

ఈ గాలి ఈ నేల ఎన్ని సమ్మిట్స్ చూడలేదు, కాలాలు మారుతున్నాయి, కేలండర్లు గిర్రున తిరుగుతున్నాయి, అయినా కానీ ఈ సమ్మిట్స్ వల్ల పారిశ్రామిక విప్లవం రాలేదే, అంతే కాదు నిరుద్యోగం పోలేదే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే కదా పరిస్థితి ఉంది అన్నది సగటు జనం వేదనగా ఉంది. ఇక కాస్తా వెనక్కి వెళ్తే తెలంగాణాలో కేసీఆర్ టైం లో కానీ రేవంత్ రెడ్డి టైంలో కానీ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ ఎన్నో జరిగాయి. ఇక ఏపీలో అయితే చంద్రబాబు ఆ తరువాత వైఎస్ జగన్ మళ్ళీ చంద్రబాబు 2024లో పవర్ లోకి వచ్చాక సమ్మిట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ సమ్మిట్స్ లో ఏకంగా వేలు కాదు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెగ ఊదరగొట్టడం తప్ప ఆచరణలో జరిగింది ఏమిటి అన్నది కూడా అంతా సీరియస్ గానే ఆలోచిస్తున్న విషయంగా ఉందిపుడు.

ఒప్పందాల కధ ఏంటో :

ఇలా జరుగుతున్న సమ్మిట్స్ ని చూసి వాటి మీద చేస్తున్న ఆర్భాటం ప్రచారం చూసిన వారు అనుకునే మాట ఏంటి అంటే ఈ ఒప్పందాల వెనక ఉన్న కధ ఏంటి అని. నిజంగా ఒప్పందం ఒక ప్రభుత్వం తో పారిశ్రామిక సంస్థలు చేసుకుంటే అవి కచ్చితంగా అమలు జరిగి తీరాలి కదా. ఎందుకు అంటే అక్కడ ఉన్నది బలమైన ప్రభుత్వం. ప్రభుత్వంతో ఎవరూ మోసం చేసేది ఉండదు, కానీ జరుగుతున్నదేంటి, లక్షల ఒప్పందాలు అంటే అందులో పదవ వంతు అయినా గ్రౌండ్ కావాలి కదా అన్నదే అందరిలో వస్తున్న ఆలోచనగా ఉంది. అయితే అంతా అనుకుంటున్నది ఏంటి అంటే ఫేక్ ఎంఓయూలు ఏమైనా జరుగుతున్నాయా అని పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోందిట. ఎందుకు అంటే ఎవరికీ జాబ్స్ అయితే ఈ సమ్మిట్స్ వల్ల వచ్చినది అయితే లేదు అని అంటున్నారు.

వైట్ పేపర్ రిలీజ్ చేయాలి :

ప్రభుత్వం అంటే కోట్లాది మంది ప్రజలకు సంబంధించినది. వారి తల రాతలను రాసేది, వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చేది. అలాంటి ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తే దాని వల్ల ప్రజలకు ఎంతో మేలు జరగాలి. కానీ జరుగుతున్నది చూస్తే కేవలం ప్రచారంగానే అంతా మిగులుతోంది. అందుకే నిజాయతీగా పారదర్శకంగా ప్రజలకు అన్ని విషయాలు చెప్పాల్సి ఉంది అని అంటున్నారు. దాని కోసం ఈ సమ్మిట్స్ వల్ల ఎన్ని జాబ్స్ వచ్చాయి అన్నది వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాలు ఆ విధంగా ప్రజలకు తాము అసలైన జవాబుదారీగా ఉన్నామని రుజువు చేసుకోవాలని అంతా కోరుతున్నారు. వైట్ పేపర్ కావాలని నిరుద్యోగ యువత చర్చిస్తోంది. అలాగే కోరుతోంది కూడా.

మీడియా హడావుడి :

ఇక చూస్తే ఏదో టీవీలలో హడావుడి చేయడమే కానీ రియల్ గా చూస్తే గ్రామాలలో ఈ తరహా సమ్మిట్స్ విషయంలో పెద్దగా చర్చ అయితే జరగడం లేదు అని అంటున్నారు. ఎకానమీ గ్రోత్ అనేది గ్రామీణ ప్రాంతాలలో ఉన్న జనాభా తోనే సాధ్యం అవుతుంది అని అంటున్నారు. మనది ఎక్కువగా వ్యవసాయిక ప్రాంతం కాబట్టి ఆ విధంగా ప్రాజెక్టులు కానీ సంస్థలు కానీ వస్తేనే రూరల్ ఎకానమీ పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది. జాబ్స్ కూడా ఆయా సెక్టార్లలో వస్తాయని మేధావులు అంటున్నారు. రూరల్ సెక్టార్ లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ఎగుమతి చేయడం ద్వారానే ఎకానమీని పెంచుకోవచ్చు అని అంటున్నారు. కేవలం పట్టణాలలో ఉన్న సర్వీస్ బేస్డ్ ఎగుమతి వల్ల అయితే పెద్దగా ఉపయోగం లేదని కూడా ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ప్రచారం కంటే కూడా :

ఇవన్నీ పాలకులు గమనంలోకి తీసుకోవాలి తప్ప సమ్మిట్ పేరుతో హడావిడి చేయడం పేపర్స్ లో టీవీలలో ప్రచారం కల్పించడం అలగే భారీ హోర్డింగ్స్ ని నగరాలలో పెట్టేసి ఇన్నేసి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పుకుంటే ఎకనామీ గ్రోత్ ఎలా సాధ్యమని అంటున్నారు. రూరల్ బేస్డ్ సెక్టార్ కి ఊతమిస్తూ ఆ దిశగా వచ్చే పరిశ్రమలకు స్వాగతం పలకడం వాటి ద్వారానే ఆర్థికంగా కానీ ఉపాధి పరంగా కానీ సాధించగలమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సగటు చెప్పొచ్చేది ఏమిటి అంటే ఒప్పడు సమ్మిట్ అన్నది అందమైన పదం, ఒక బ్రహ్మ పదార్ధంగా ఉండి అట్రాక్ట్ చేసేది, ఇపుడు అందరూ నిర్వహిస్తూ దానిని రాజకీయంగా వాడుకుంటున్నారా లేక జనాలను మభ్యపెట్టేందుకు చేస్తున్నారా అంటే మాత్రం ఆలోచించుకోవాల్సిందే మరి.


Full View


Tags:    

Similar News