'ఆర్టిఫిషియల్ లెగ్స్' ను టేబుల్‌పై పెట్టి.. రాజ్యసభలో బీజేపీ ఎంపీ రచ్చ!
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది.;
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో సోమవారం.. ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగా నికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. అయితే.. ఈసమయంలో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, కేరళ రాష్ట్రా నికి చెందిన సదానందన్ మాస్టర్ అనూహ్య రీతిలో స్పందించారు. ఆయన దివ్యాంగుడు. గతంలో కేరళలో జరిగిన రాజకీ య ఘర్షణల్లో ఆయన రెండు కాళ్లూ కోల్పోయారు. ఈ పరిణామాలు తాజాగా రాజ్యసభలో చర్చకు వచ్చాయి. సీపీఎం నేత, రాజ్యస భ సభ్యుడు బిట్రాస్‌పై ఆయన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇది ఒకరకంగా రాజ్యసభలో రచ్చకు దారి తీసింది.
ఏం జరిగింది?
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సమయంలో కేరళకు చెందిన సీపీఎం సభ్యుడు బిట్రాస్ రాష్ట్రపతి ప్రసంగంలో పస లేదని.. పేదలు, కష్ట జీవులు, రైతులు, మహిళల గురించి ఎలాంటి ప్రకటన చేయ లేదని విమర్శించారు. ఈ సమయంలో స్పందించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు.. దివ్యాంగుడు కూడా అయిన సదానంద మాస్టర్ .. తన రెండు కృత్రిమ కాళ్లను తీసి.. రాజ్యసభ చైర్మన్‌కు కనిపించేలా.. తన టేబుల్ ముందు భాగంపై పెట్టారు. దీంతో రాజ్యసభలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇలా చేయడం రాజ్యసభ నియమాలకు విరుద్ధం. బూట్లు.. చెప్పుల మాట ఎలా ఉన్నా..అసలు వ్యక్తిగత ఫోన్లు, కర్చీఫ్‌లు వంటి వాటిని కూడా టేబుళ్లపై పెట్టకూడదు.
దీంతో ఒక్కసారిగా రాజ్యసభలో కలకలం రేగింది. సదానందపై చర్యలు తీసుకోవాలని..పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను సీపీఎం సభ్యుడు బిట్రాస్ లేవనెత్తారు. ఈ సమయంలో సదానంద స్పందిస్తూ.. తాను చేసిన చర్య..పార్లమెంటుకు విరుద్ధమని అంటున్న సీపీఎం సభ్యులు.. వారు చేస్తున్న వ్యాఖ్యలు దేశానికి, రాజ్యాంగానికి కూడా విరుద్ధమని చెప్పడానికే తాను ఇలా చేయాల్సి వచ్చింద న్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఆయన సూచించారు. జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత ఇప్పుడు అత్యంత కీలకమని.. అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ విష యాన్ని ప్రతిపక్షాలకు అర్థమయ్యేలా చెప్పాలనే తాను కృతిమ కాళ్లను తీసి టేబుల్‌పై పెట్టానన్నారు.
ఈ సందర్భంగా 30 ఏళ్ల కిందట కేరళలో తనపై జరిగిన దాడిని సదానంద గుర్తు చేసుకున్నారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త అయిన.. సదానందను అప్పట్లో సీపీఎం కార్యకర్తలు అడ్డగించారు. ఆ సమయంలో ఇరు పక్షాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో సదానంద కాళ్లపై బలంగాకొట్టడంతో ఆయన తన రెండు కాళ్లను కోల్పోయారు. అయినప్పటికీ.. సదానంద ఆర్ ఎస్ ఎస్, బీజేపీల కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను రాజ్యసభకు పంపించారు.