మోడీ ఎక్క‌డ చదివారో చెప్పంటి.. నా గురించి చెబుతా: దీప్కే షాకింగ్ కామెంట్స్‌

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు..అభిజిత్ దీప్కేను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీ సానుభూతి ప‌రుడు ఒకరు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద అధికారులకు ద‌ర‌ఖాస్తుచేసిన విష‌యం తెలిసిందే.

Update: 2026-08-03 18:29 GMT

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు..అభిజిత్ దీప్కేను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీ సానుభూతి ప‌రుడు ఒకరు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద అధికారులకు ద‌ర‌ఖాస్తుచేసిన విష‌యం తెలిసిందే. దీనిలో ఆయ‌న దీప్కే అమెరికాలో చ‌దివేందుకు అంత సొమ్ము లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో వివ‌రాలు తెల‌పాల‌ని ఐటీ అధికారుల‌ను కోరారు. అలానే.. కుటుంబ ఆస్తి వివ‌రాలు కూడా ప‌రిశీల న చేయాల‌ని సూచించారు. ఈ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. బీజేపీ ఒక‌టి త‌లిస్తే.. దీప్కే అస‌లుకే ఎస‌రు పెట్టేలా.. కీల‌క వ్యాఖ్య‌లుచేశారు. తాజాగా ఆయ‌న‌సెల్ఫీ వీడియోను విడుద‌ల‌చేశారు.

దీని లో దీప్కే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ''నా గురించి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మీ నేత గురించి నేను అడుగుతున్నా. ఆయ‌న గురించి మీరు చెప్పండి. అప్పుడు నా గురించి చెబుతా'' అంటూ.. కీల‌క వ్యాఖ్య‌లుచేశారు. తాను అమెరికాలో ఎలాచ‌దువుకున్నాన‌న్న‌ది కొంద‌రికి అనుమానంగా ఉంద‌ని అన్నారు. అయితే.. ఈ అనుమానం కొంద‌రికి మాత్ర‌మే ఉంద‌ని, కానీ, ప్ర‌ధాని, బీజేపీ నాయ‌కుడు మోడీ ఎక్క‌డ చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? ఆయ‌నకు ఉన్న ప‌ట్టాలెన్ని? ఇలాంటి అనేక సందేహాలు దేశ వ్యాప్తంగా 140 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు సందేహాలు ఉన్నాయ‌ని తెలిపారు. వీటిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని దీప్కే ప్ర‌శ్నించారు.

అదే స‌మ‌యంలో తాను అమెరికాలో చ‌దువుకునేందుకు అప్పు చేశాన‌ని చెప్పారు. ఆ అప్పు ఎక్క‌డ నుంచి తీసుకున్న‌దీ.. ఏయే బ్యాంకులు ఎంతెంత మొత్తం ఇచ్చాయో కూడా తాను లెక్క‌లు చెబుతాన‌ని దీప్కే స‌వాల్ రువ్వారు. అంతేకాదు.. కుటుంబ ఆదాయం గురించి కూడా కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నార‌న్న ఆయ‌న‌.. త‌న తండ్రి రిటైర్డ్ ఎంప్లాయ్ అని.. ఈ విష‌యాన్ని మ‌రిచిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న‌కు నెల‌కు పింఛ‌నుతో పాటు.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న ప‌డ్డ కృషికి వ‌చ్చిన సొమ్ము ఉంద‌న్నారు. తాను కూడాపార్ట్ టైమ్ ప‌నులు చేసుకున్నా.. మీలాగా.. ఎదుటి వారిని ప్ర‌శ్నించేందుకు స‌మ‌యం వృథా చేసుకోలేద‌ని సెటైర్లు వేశారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం.. మోడీకి ముడి పెట్ట‌డంతో బీజేపీ నాయ‌కులు సైలెంట్ అయిపోయారు.

Tags:    

Similar News