• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  బోస్టన్‌లో తెలుగు...

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

| అమెరికాలో తెలంగాణకు చెందిన తెలుగు విద్యార్థిని కోయ శ్రీజా రెడ్డి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మసాచుసెట్స్ యూనివర్సిటీ బోస్టన్‌లో చదువుతున్న ఆమె నవంబర్ 2 రాత్రి 9.45 గంటలకు డోర్చెస్టర్‌లోని ఎడిసన్ గ్రీన్ ప్రాంతం నుంచి చివరిసారిగా బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. క్యాజిల్ ఐలాండ్ వైపు వెళ్లినట్లు సమాచారం. ఆమె ఆచూకీ తెలిసిన వారు 911 లేదా బోస్టన్ పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. కుటుంబ సభ్యులు, తెలుగు ఎన్నారైలు ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఆశిస్తున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-06 06:33 GMT

అమెరికాలో తెలుగు విద్యార్థుల ఘటనలు వరుసగా కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు, ప్రమాదాలు పలువురు విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేశాయి. ఇప్పుడు మరో విద్యార్థిని అదృష్టం కావడం.. 36 గంటలుగా ఆమె ఆచూకీ కనిపించకపోవడంతో కలకలం చెలరేగింది.

ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలుగు విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చదువు, కెరీర్‌ కలలతో అమెరికా వెళ్లిన యువతి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో తెలంగాణలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు బోస్టన్‌లోని తెలుగు ఎన్నారైలు, విద్యార్థులు ఆమె ఆచూకీ కోసం సహకరించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణలోని నల్గొండకు చెందిన కోయ శ్రీజా రెడ్డి అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ బోస్టన్‌లో చదువుకుంటున్నారు. ఎఫ్‌-1 విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్న ఆమె నవంబర్ 2వ తేదీ రాత్రి నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఆమె అదృశ్యమైనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోస్టన్ పోలీసుల వివరాల ప్రకారం.. నవంబర్ 2వ తేదీ రాత్రి 9.45 గంటల సమయంలో డోర్చెస్టర్‌లోని ఎడిసన్ గ్రీన్ ప్రాంతం నుంచి శ్రీజ చివరిసారిగా బయటకు వెళ్లినట్లు గుర్తించారు. స్క్వాంటమ్ ఛానల్ సమీపంలో ఆమె కనిపించినట్లు పోస్టర్లలో పేర్కొన్నారు. అక్కడి నుంచి క్యాజిల్ ఐలాండ్ వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు సమాచారం. శ్రీజ ఆచూకీ తెలిసిన వారు 911కు ఫోన్ చేయాలని.. లేదంటే డోర్చెస్టర్ పోలీస్ డిస్ట్రిక్ట్ డిటెక్టివ్ విభాగాన్ని 617-343-4335 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల విషయంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని నల్గొండలోని ఆమె కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం బోస్టన్‌లోని తెలుగు సమాజం స్పందించాలని వేడుకుంటున్నారు.

Tags:    
  • sreejareddy 
  • telugustudent 
  • boston 
  • telanganastudent 
  • missingstudent 

Similar News

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS