సిద్ధరామయ్య దిగితే...రేవంత్ రెడ్డి కూడా దిగాలా ?

కాంగ్రెస్ కి దేశంలో ఉన్నది మూడంటే మూడు రాష్ట్రాలు. అందులో హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం అయితే దక్షిణాన ఆ పార్టీకి ఉన్నది తెలంగాణా అలాగే కర్ణాటక.;

Update: 2025-12-10 15:30 GMT

కాంగ్రెస్ కి దేశంలో ఉన్నది మూడంటే మూడు రాష్ట్రాలు. అందులో హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం అయితే దక్షిణాన ఆ పార్టీకి ఉన్నది తెలంగాణా అలాగే కర్ణాటక. ఈ రెండు రాష్ట్రాలలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒక విధంగా కాంగ్రెస్ కి అచ్చివచ్చిన ఏడాదిగా 2023 ఉంది. ఇక కర్ణాటకలో కానీ తెలంగాణలో కాంగ్రెస్ కానీ అధికారం అయితే దక్కింది కానీ సీఎం రేసులో చాలా మంది అక్కడా ఇక్కడా కూడా ఉన్నారు. ఇక కర్ణాటకలో సిద్దరామయ్య డీకే శివకుమార్ ల మధ్య ఒక రేంజిలో పోటీ నడచింది. తెలంగాణాలో అంత కాకపోతే సీనియర్ నేతలు చాలా మంది సీఎం సీటు మీద ఆశలు పెట్టుకుని హైకమాండ్ చేసిన సర్దుబాటుతో వెనక్కి తగ్గారు. ఇపుడు చూస్తే అక్కడ రెండున్నరేళ పాలన తెలంగాణాలో రెండేళ్ళ పాలన పూర్తి అయ్యాయి. కాంగ్రెస్ కల్చర్ ప్రకారం చూస్తే ఏడాదికి ఒక సీఎం మారాలి. కానీ అంతకంటే ఎక్కువ కాలమే అయింది. కాబట్టి వేచి చూసే ఓపిక లేని వారు అంతా సీన్ లోకి వస్తున్నారు. కర్ణాటకలో అయితే ఏకంగా సిద్దరామయ్య డీకే శివకుమార్ ల మధ్యన చెరి రెండున్నరేళ్ళ పాటు సీఎం పోస్టు అన్న ఒప్పందం కూడా కాంగ్రెస్ అధినాయకత్వం కుదిరించింది అని ప్రచారం అయితే ఉంది.

కర్ణాటక ఫార్ములాతో :

ఇక కాంగ్రెస్ లో ఇపుడు చూస్తే కర్ణాటక ఫార్ములాతో తలకాయ నొప్పి వస్తోంది అని అంటున్నారు. అక్కడ సిద్దరామయ్య దిగితే డీకే శివకుమార్ సీఎం గద్దెనెక్కుతారు. అయితే అదంత సులువు ఏమీ కాదని అంటున్నారు. ఎందుకంటే అదే కనుక జరిగితే పొరుగున ఉన్న మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణా మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుంది అని అంటున్నారు. అందుకే అక్కడ కొంత గ్యాప్ తీసుకుంటున్నారు అని చెబుతున్నారు. ఒక వేళ అనూహ్యమైన పరిణామాలు జరిగి సిద్ధరామయ్య కనుక అక్కడ దిగితే తెలంగాణా కాంగ్రెస్ లోనూ అసమ్మతి పెరిగి అక్కడ కూడా కుంపట్లు తయారు అవుతాయని అంటున్నారు.

డీకే సొంత బలంతో :

ఇక కర్ణాటకలో చూస్త డీకే శివకుమార్ సిద్దరామయ్య ఇద్దరూ బలమైన నాయకులే. ఇక డీకే సంగతి చూస్తే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆంతో ఆయనకు సొంత వర్గం కూడా గట్టిగానే ఉంది. దాంతో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా డీకేని చూసి కొంత ఆగాల్సి ఉందనే ప్రచారం ఉంది. అయితే తెలంగాణలో చూస్తే కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బ్రాండ్ కానే కాదు, ఆయన ఎమోషన్ లో సీఎం అయిన వారుగా అంతా చూస్తున్నారు ఇక కాంగ్రెస్ లో ఎంతో మంది ఉన్నారు, ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి, కానీ అందులో ఏ వర్గం రేవంత్ రెడ్డి సొంతం అంటే జవాబు ఆలోచించాల్సి వస్తోంది అని అంటున్నారు. ఈ రోజున రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి అందరూ ఆయన దగ్గరకు వెళ్తున్నారు. తేడా వస్తే కనుక ఎవరూ ఆయనకు పెద్దగా సపోర్ట్ చేసే సీన్ ఉంటుందా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. అయితే తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ హ్యాపీగా లేరు అని అంటున్నారు. దీని మీద ఒక సర్వే కూడా బయటకు వచ్చింది అని గుర్తు చేస్తున్నారు.

జనాలు అంతేగా :

ఇక తెలంగాణలో రెండేళ్ళ కాంగ్రెస్ పాలన ముగిసింది. మరో వైపు జనాలలో కూడా ఎవరూ ఏమంత సుఖంగా లేరని కూడా సర్వే నివేదికలు వెళ్ళడిస్తున్నాయి. పట్టణాలు అర్బన్ సెక్టార్ జనాలు అయితే అసలు హ్యాపీగా లేరని అంటున్నారు రూరల్ లోనూ పరిస్థితి అలాగే ఉంది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రామీణ ప్రాంతాలలో పర్యటించినది అయితే పెద్దగా లేదని అంటున్నారు. అలాగే గ్రామాల్లో భారీ ప్రాజెక్టులు కానీ కార్యక్రమాలు కానీ లేవని కూడా గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ లో ఒక్క కొత్త ప్రాజెక్టు కానీ ఈ రెండేళ్ళ పాలనలో అయితే తెచ్చినది అయితే లేనే లేదనే అంటున్నారు దాంతో అర్బన్ సెక్టార్ అయితే పాలన పట్ల పెదవి విరుస్ర్తోంది అని చెబుతున్నారు.

హైకమాండ్ ఫోకస్ :

ఇక రేవంత్ రెడ్డి పాలన మీద ఆయన రాజకీయాల మీద కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. బడా భాయ్ అంటూ తరచూ ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలవడం కూడా కాంగ్రెస్ పెద్దలకు అంతగా నచ్చడం లేదని అంటున్నారు. టెక్నికల్ గా చూస్తే రాజ్యాంగం ప్రకారం సీఎం ప్రధానిని కలవడంలో తప్పు లేదు, అలాగే ఆర్ధికపరమైన అంశాల క్లియరెన్స్ కోసం కేంద్ర సాయం కోసం కలుస్తున్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నా కూడా కాంగ్రెస్ హైకమాండ్ అయితే మోడీతో రేవంత్ రెడ్డి భేటీల మీద పెద్దగా ఇష్టపడడం లేదు అని అంటున్నారు. ఇక చూస్తే కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే ఎక్కువగా మోడీని కలుస్తున్నారు అని ప్రచారంలో ఉంది. ఆయన తోటి కాంగ్రెస్ సీఎం కర్ణాటకలో సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన మోడీని అసలు కలవడం లేదు కదా అని కూడా గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఇండియా కూటమిలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా మోడీతో పెద్దగా టచ్ లోకి రావడం లేదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అనేక సార్లు కేంద్ర పెద్దలతో భేటీలు అవుతున్నారు. దాంతోనే కాంగ్రెస్ పెద్దలకు కూడా అసంతృప్తి అయితే ఇదే విషయం మీద ఉంది అని అంటున్నారు. అయితే ఏ విషయం అయినా కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ లోనే ఉంటుంది అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే కర్ణాటకలో సీఎం కుర్చీ కదిలితే మాత్రం ఆ ప్రభావం ఆ సెగ తెలంగాణాకు కూడా తాకవచ్చు అన్నది రాజకీయంగా అంతా విశ్లేషిస్తున్న మాటగా ఉంది.


Full View


Tags:    

Similar News