షాకింగ్.. చైనా వెళ్తున్న నౌకలో నడి సముద్రంలో భారతీయ అధికారి అదృశ్యం!

అవును... 2025 జూలై 14 నుంచి ఆంగ్లో-ఈస్టర్న్ ప్రైవేట్ షిప్ మేనేజ్ మెంట్ లో పనిచేస్తున్న ఒడిశాలోని భద్రక్ జిల్లా కేస్పూర్ కు చెందిన సార్థక్ మహాపాత్రో.. విధుల్లో ఉండగా అదృశ్యమయ్యారనే విషయం కలకలం రేపుతోంది.;

Update: 2026-02-06 07:49 GMT

ఓ షాకింగ్ విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మారిషస్ సమీపంలో ఓడలో విధుల్లో ఉన్న ఒడిశాలోని భద్రక్ జిల్లాకు చెందిన ఓ మర్చంట్ నేవీ అధికారి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి కనిపించడం లేదు.. ఆయన విధుల్లో ఉండనే అదృశ్యమయ్యారనే విషయం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో.. అతని కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తక్షణ జోక్యాన్ని కోరుతున్నారు. ఆ నౌక సింగపూర్ నుంచి చైనా వెళ్తుండటం గమనార్హం.

అవును... 2025 జూలై 14 నుంచి ఆంగ్లో-ఈస్టర్న్ ప్రైవేట్ షిప్ మేనేజ్ మెంట్ లో పనిచేస్తున్న ఒడిశాలోని భద్రక్ జిల్లా కేస్పూర్ కు చెందిన సార్థక్ మహాపాత్రో.. విధుల్లో ఉండగా అదృశ్యమయ్యారనే విషయం కలకలం రేపుతోంది. ఈ సమయంలో అతని తల్లి రష్మిత మహాపాత్రో అతడి అదృశం, దానికి ముందు జరిగిన సంఘటనలు వెల్లడిస్తూ... ఈ సందర్భంగా ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యాన్ని కోరారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... చైనా నుంచి పశ్చిమ ఆఫ్రికాకు ప్రయాణించి, అనంతరం సింగపూర్ మీదుగా చైనా తిరిగి వెళ్తున్న నౌకలో తన కుమారుడు పని చేస్తున్నారని.. ఈ క్రమంలో నౌక ఫిబ్రవరి 2న సింగపూర్ సమీపంలో ఉండగా సార్థక్.. తనతోనూ, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతోనూ వీడియో కాల్ లో మాట్లాడినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ మరుసటి రోజు అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు అది సాధ్యపడలేదని ఆమె వెల్లడించారు.

ఈ క్రమంలో అతడి అదృశ్యంపట్ల తాము తీవ్ర దిగ్భ్రాంతి చెందామని.. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని.. తన కుమారుడిని రక్షించి, సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని ఆమె ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ-మెయిల్ పంపారు. ఇదే సమయంలో ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా.. ప్రధాని, ముఖ్యమంత్రి, షిప్పింగ్ డైరెక్టర్ జనరల్, విదేశాంగ మంత్రిత్వ శాఖలను ఆమె కోరారు. ఇదే సమయంలో ఈ దర్యాప్తుకు సంబంధించి రెగ్యులర్ అప్ డేట్స్ ను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు సార్థక్ కనిపించడం లేదని షిప్పింగ్ కంపెనీ అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో.. అతడు ఫిబ్రవరి 3న తన క్యాబిన్ లోకి వెళ్లినట్లు రికార్డుల్లో ఉందని కంపెనీ అధికారులు చెబుతూ.. అతడి కోసం నౌక మొత్తం గాలించినా, ఆచూకీ తెలియలేదని తెలిపారు. సముద్ర ప్రాంతంలోనూ గాలింపు ప్రారంభించామని అన్నారు!




Tags:    

Similar News