ఇండియా రిచెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఎవరు? రొనాల్డో, మెస్సీల రేంజ్ ఎంత?
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల్లో ఫుట్‌బాల్ ఒకటి. ఈ ఆటలో రాణించే స్టార్ ప్లేయర్లు కేవలం మైదానంలోనే కాకుండా.. మైదానం వెలుపల కూడా భారీగా సంపాదిస్తూ ఆర్థికంగా తిరుగులేని శక్తులుగా ఎదుగుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల్లో ఫుట్‌బాల్ ఒకటి. ఈ ఆటలో రాణించే స్టార్ ప్లేయర్లు కేవలం మైదానంలోనే కాకుండా.. మైదానం వెలుపల కూడా భారీగా సంపాదిస్తూ ఆర్థికంగా తిరుగులేని శక్తులుగా ఎదుగుతున్నారు. అంతర్జాతీయంగా క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల ఆర్థిక సామ్రాజ్యాల గురించి అందరికీ తెలిసిందే. అయితే భారతదేశంలోనే అత్యంత సంపన్న ఫుట్‌బాల్ ప్లేయర్ ఎవరు? అనే ప్రశ్న వస్తే చాలా మంది మనసులో మొదట మెదిలే పేరు సునీల్ ఛేత్రి. కానీ ఆశ్చర్యకరంగా భారత మాజీ డిఫెండర్, ప్రస్తుత కోచ్ గౌరమాంగి సింగ్ దాదాపు రూ.41 కోట్ల అంచనా నికర ఆస్తి విలువతో భారతదేశంలోనే అత్యంత సంపన్న ఫుట్‌బాల్ ఆటగాడిగా విస్తృతంగా గుర్తింపు పొందారు. అదే సమయంలో దేశంలోని అత్యంత సంపన్నమైన క్రికెటర్లతో పోలిస్తే ఫుట్ బాల్ ఆటగాడు ఏ రీతిన తీసికట్టుగా ఉన్నారో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది భారతదేశంలో ఫుట్ బాల్ ఆటకు ఉన్న రేంజ్ ఏంటో కూడా తెలుసుకోవడానికి ప్రామాణికత.
గౌరమాంగి సింగ్ తన ఆడే రోజుల్లో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నమ్మకమైన సెంటర్-బ్యాక్ డిఫెండర్లలో ఒకరిగా నిలిచారు. 2006 నుండి 2013 మధ్య భారత జాతీయ జట్టు తరఫున 71 మ్యాచ్‌లు (క్యాప్స్) ఆడి... 7 గోల్స్ చేసిన ఆయన.. భారత్ సాధించిన 2008 ఏఎఫ్‌సి ఛాలెంజ్ కప్, 2009 నెహ్రూ కప్, 2011 ఎస్.ఏ.ఎఫ్.ఎఫ్ ఛాంపియన్‌షిప్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా రిటైర్ అయిన తర్వాత ఆయన కోచ్‌గా మారి ఇండియన్ సూపర్ లీగ్ (ISL) క్లబ్ అయిన`ఎఫ్‌సి గోవా`కు అసిస్టెంట్ కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఈ విధంగా తన కెరీర్ సంపాదన... కోచింగ్ బాధ్యతల ద్వారా ఆయన ఈ భారీ ఆస్తిని కూడబెట్టారు. మరోవైపు దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన మాజీ జాతీయ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రి ప్రస్తుతం అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న యాక్టివ్ ప్లేయర్‌గా నిలుస్తున్నా..ఆయన అంచనా నికర ఆస్తి విలువ సుమారు రూ.8కోట్ల నుండి రూ.12.5 కోట్లుగా ఉంది. అంతర్జాతీయ ఆటగాళ్లతో పోలిస్తే మన ఫుట్ బాల్ ఆటగాళ్లు ఎంత నిరుపేదలో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
భారతీయ ఆటగాళ్ల ఆర్థిక ప్రొఫైల్స్ ఇలా ఉంటే.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ టైటాన్స్ అయిన క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల రేంజ్ మాత్రం పూర్తిగా వేరే స్థాయిలో ఉంది. ఈ ఇద్దరు గ్లోబల్ ఐకాన్లు ఇప్పటికే అధికారికంగా `బిలియనీర్ క్లబ్`లోకి అడుగుపెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్న అథ్లెట్లుగా నిలిచారు. 2026 నాటి తాజా ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం... పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంచనా నికర ఆస్తి విలువ సుమారు 1.2 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ కూడా బిలియన్ డాలర్ల మార్కును దాటి ప్రస్తుతం దాదాపు 1.1 బిలియన్ డాలర్ల నికర ఆస్తితో రొనాల్డినోకు అత్యంత సమీపంలో గట్టి పోటీని ఇస్తున్నారు.
క్రిస్టియానో రొనాల్డో తన అపారమైన సంపదను సృష్టించడానికి మొదటి నుండి ఒక పక్కా వ్యాపార వ్యూహాన్ని, పర్సనల్ బ్రాండింగ్‌ను అనుసరించారు. ముఖ్యంగా సౌదీ అరేబియాకు చెందిన `అల్ నస్ర్` క్లబ్‌కు మారిన తర్వాత భారీ జీతం.. కమర్షియల్ అగ్రిమెంట్ల ద్వారా ప్రతి ఏటా వందల మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నారు. ఇది కాకుండా నైక్ సంస్థతో కుదుర్చుకున్న లైఫ్‌టైమ్ పార్టనర్‌షిప్, ఫ్యాషన్, హోటళ్లు, జిమ్‌ల రంగంలో విస్తరించిన ఆయన సొంత బ్రాండ్ `CR7`... అలాగే తనకున్న భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ద్వారా వచ్చే ఆదాయం రొనాల్డో ఆర్థిక సామ్రాజ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనదిగా మార్చాయి.
లియోనెల్ మెస్సీ విషయానికి వస్తే.. అతడి ఆర్థిక వృద్ధి కోసం రొనాల్డో కంటే భిన్నమైన, వ్యూహాత్మకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. మెస్సీ తన కెరీర్ ప్రారంభంలో పూర్తిగా ఆటపైనే దృష్టి కేంద్రీకరించి... ఆ తర్వాత కాలంలో స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్లు , వ్యాపారాల వైపు అడుగులు వేశారు. అమెరికాకు చెందిన `ఇంటర్ మయామి` క్లబ్‌లోకి ప్రవేశించడం అమెరికా మార్కెట్‌లో ఆయన బిజినెస్ రేంజ్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. క్లబ్ అందించే వేతనంతో పాటు లీగ్‌కు సంబంధించిన రెవెన్యూ-షేరింగ్ (ఆదాయంలో వాటా) ఒప్పందాలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్ ఇతర మేజర్ వెంచర్లలో పెట్టుబడులు మెస్సీ సంపదను భారీగా పెంచి తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలబెట్టాయి. రొనాల్డినో, మెస్పీ సంపదలతో పోలిస్తే భారతదేశంలోని ఫుట్ బాల్ ఆటగాళ్ల స్థితిగతులు ఎంత పేదరికంలో ఉన్నాయో అర్తం చేసుకోవచ్చు. కారణాలు ఏవైనా మన దేశంలో ఫుట్ బాల్ క్రీడ స్థితిగతుల్ని కూడా ఇది అర్థమయ్యేలా చెబుతుంది.