టీమిండియాకు ఏమైంది.. ఏంటీ శాపం?
ఇక సాయి సుదర్శన్‌కు కాలి బొటనవేలికి గాయం కావడంతో శ్రీలంక టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌పైనా ప్రభావం పడింది.
టీమ్‌ఇండియాను ప్రస్తుతం గాయాల బెడద వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో జట్టు కాంబినేషన్‌పై ప్రభావం పడుతోంది. ఒకరు కోలుకునేలోపే మరో ఆటగాడు గాయపడటం టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం భారత క్రికెట్‌లో గాయాల నుంచి కోలుకుంటున్న లేదా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ల సంఖ్య 10కి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ జాబితాలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ తదితరుల పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ ప్రక్రియలో ఉన్నారు.
ముఖ్యంగా బుమ్రా గాయం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇంగ్లండ్‌తో వన్డే సందర్భంగా ఎడమ మోకాలికి గాయమైన బుమ్రా.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందినప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దీంతో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని దూరం చేశారు.
అలాగే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కూడా ఇంగ్లండ్ పర్యటనలో హ్యామ్‌స్ట్రింగ్ గాయాలకు గురయ్యారు. హర్షిత్‌కు గ్రేడ్-1, వరుణ్‌కు గ్రేడ్-2 హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. వీరిద్దరినీ రిహాబిలిటేషన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపించారు.
ఇక సాయి సుదర్శన్‌కు కాలి బొటనవేలికి గాయం కావడంతో శ్రీలంక టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌పైనా ప్రభావం పడింది.
రిహాబ్ వ్యవస్థపై బీసీసీఐ దృష్టి
వరుస గాయాల నేపథ్యంలో బీసీసీఐ సైతం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు ఆటగాళ్ల రిహాబిలిటేషన్, ఫిట్‌నెస్ ప్రోటోకాల్స్‌పై సమీక్షించనున్నట్లు సమాచారం. ఆటగాళ్లకు వేర్వేరు ఫిట్‌నెస్ ప్రమాణాలు అమలు చేయడం వల్ల అసమానతలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బ్రోంకో టెస్ట్, 2 కిలోమీటర్ల రన్ వంటి ప్రామాణిక ఫిట్‌నెస్ పరీక్షలను అందరికీ ఒకే విధంగా అమలు చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. దీని ద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయిని ఒకే ప్రమాణంతో అంచనా వేయడంతో పాటు... గాయాల నివారణపై మరింత దృష్టి పెట్టాలని బోర్డు భావిస్తోంది.
వరుస గాయాలు ఇలాగే కొనసాగితే రాబోయే సిరీస్‌లలో టీమ్‌ఇండియా తుది జట్టు కూర్పు మరింత సవాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆధారపడే పరిస్థితి తగ్గించి... ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్ధంగా ఉంచడం ఇప్పుడు భారత జట్టు ముందున్న అతిపెద్ద అవసరంగా మారింది.