వెన్నులో వణుకు పుట్టించే మర్డర్ ప్లాన్.. పుణే కేసులో వెలుగులోకి సంచలన నిజాలు!
ఆరోగ్యం సహకరించకపోయినా, మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే విష్ణు విశాల్ తన కొత్త సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.
కాబోయే భార్య చేతిలో హత్యకు గురైన పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేతన్ తో పెళ్లి ఇష్టం లేని సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా ఈ ఇద్దరు కలిసి ఎలా మర్డర్ ప్లాన్ చేశారన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు కీలక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చారు. కేతన్ ను అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో చాలా రోజుల ముందు నుంచే సియా గోయల్ ప్లాన్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని అంటున్నారు. హత్యకు నాలుగు రోజుల ముందు కూడా ఒక కొండపై నుంచి కేతన్ పడిపోయాడని, అప్పట్లో ప్రమాదమని భావించిన కుటుంబ సభ్యులు, తాజాగా ఆ సంఘటన కూడా హత్యాయత్నంగానే అనుమానిస్తున్నారు.
ఒక సారి హత్య ప్లాన్ బెడిసి కొట్టడంతో సియా గోయల్ పక్కా ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యకు ముందు రోజు ఓ కేఫ్ లో చేతన్ తో కలిసి కేతన్ ను అడ్డు తొలగించుకోవడంపై సుదీర్ఘంగా చర్చించారని అంటున్నారు. తన పుట్టినరోజు పేరు చెప్పి కేతన్ ను లోహగఢ్ ఫోర్ట్ కు తీసుకువెళ్లాలని కేఫ్ లోనే సియా, చేతన్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ ఇద్దరు గంట సేపు కేఫ్ లో మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా కేఫ్ లోని సియా, చేతన్ ఉన్న వీడియోను సేకరించారని అంటున్నారు.
కేతన్ ను హతమార్చి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించడానికి లోహగఢ్ ఫోర్ట్ ను ఎంపిక చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సియా తన మొబైల్ లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సియా మొబైల్ యూట్యూబ్ హిస్టరీలో కూడా ఈ విషయం స్పష్టమైందని చెబుతున్నారు. పక్కాప్లాన్ తో హత్య చేసి తప్పించుకోవచ్చిన నిందితులు భావించినా, టెక్నాలజీ పట్టించిందని అంటున్నారు. డిజిటల్ ఫుట్‌ప్రింట్స్, సియా సెర్చ్ హిస్టరీ, కేఫ్ వీడియోలు ఇప్పుడు సరైన సాక్ష్యాలుగా మారాయని అంటున్నారు. దీంతో నిందితులు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా, సాంకేతికత, డిజిటల్ ఆధారాల ముందు వారి ముసుగులు తొలగిపోయాయని అంటున్నారు.
కాగా, ఈ ఘటన ఈ ఘటన దేశవ్యాప్తంగా విస్తృత చర్చనీయాంశంగా మారింది. పెళ్లి సంబంధాలపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోందని అంటున్నారు. నమ్మకం అనేది వ్యక్తిగతమైనదైనా, మనుషుల ప్రవర్తనలో మార్పులను గమనించడం ఎంత ముఖ్యమో ఈ విషాదం గుర్తు చేస్తోంది. సియా, చేతన్‌ల క్రూరత్వం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఇలాంటి నేరాలకు పాల్పడటానికి వారిని ప్రోత్సహించిన అంశాలు ఏమిటి? అనే ప్రశ్నలకు పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.