తీవ్ర చర్చ... నేరం మొబైల్ ఫొన్స్ దా లేక తల్లితండ్రులదా..!

అవును... ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నిషిక (16), ప్రాచి (14), పాఖి (12) అక్కాచెల్లెల్లు తమ నివాస భవనంలోని తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.;

Update: 2026-02-06 10:30 GMT

వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. టీనేజ్ పిల్లలు వారికి వారు ఆత్మహత్యలకు పాల్పడగా.. మరో ఘటనలో స్వయంగా తల్లే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ మనసిక ఆందోళనలు, ఒంటరితనం, మొబైల్ ఫోన్స్ కి విపరీతంగా అడిక్ట్ అవ్వడంతో పాటు పిల్లలపై తల్లితండ్రుల శ్రద్ధ కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనలు సమాజంలో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

అవును... ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నిషిక (16), ప్రాచి (14), పాఖి (12) అక్కాచెల్లెల్లు తమ నివాస భవనంలోని తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారి డైరీలో... కొరియన్ సంస్కృతి, కొరియన్ నాటకాలు, కొరియన్ చిత్రాలతో పాటు కే-పాప్ సంగీతంపై వారికున్న ప్రేమను పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ ఫోన్స్ తీసేసుకుని కొరియన్ షోలు చూడకుండా తమ తండ్రి అడ్డుకున్నారని.. అందుకే ఈ నిర్ణయం అని పోలీసులు తెలిపారు!

వీరు ముగ్గురూ మరియా, సిండీ, అలీజా వంటి కొరియన్ పేర్లను ఉపయోగించి సోషల్ మీడియా అకౌంట్స్ ని కలిగి ఉండగా.. వారికి గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో తమ తండ్రి తమ నుంచి మొబైల్ ఫోన్స్ తీసేసుకోవడంతో.. వీరికి కొరియన్ సంస్కృతి నుంచి దూరం అయిపోతున్నామనే ఆందోళన తీవ్రస్థాయికి పెరిగింది. ఇది కొరియన్ సంస్కృతికి వారి వ్యామోహం ప్రమాదకరస్థాయికి చేరిందని చెప్పకనే చెబుతోంది.

ఈ క్రమంలోనే వీరు ముగ్గురు మంగళవారం తెల్లవారుజామున 2:15 గంటల ప్రాంతంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. పెద్ద శబ్ధం విన్న పొరుగువారు ఆందోళన చెందారు. ఈ సమయంలో ఓ సూసైడ్ నోట్ దొరికింది. అందులో... తమ తండ్రికి క్షమాపణలు చెప్పిన ముగ్గురు అక్కాచెల్లెల్లు... అన్ని సమాధానాల కోసం డైరీని చదవమని కోరారు! ఈ సందర్భంగా గోడలపై ఉన్న రాతల్లో.. వారి జీవితాలు చాలా ఒంటరిగా ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పిల్లలకు సెల్ ఫోన్ కొనిచ్చిన తండ్రి, దాన్ని వారు దేనికి వినియోగిస్తున్నారు.. ఎలా వినియోగిస్తున్నారు.. ఏ మేరకు అడిక్ట్ అయ్యారు.. ఏమేమి చూస్తున్నారు అనేది మానిటర్ చేయలేకపోయారు! పిల్లలకు కొరియన్ సంస్కృతిపై వ్యామోహం తీవ్ర ప్రమాదస్థాయికి వెళ్లిన తర్వాత కానీ ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. దానికి వారి వద్ద నుంచి సెల్ ఫోన్ ను వెనక్కి తీసుకోవడం ఒకటే పరిష్కారం అనుకున్నట్లున్నారు!

మరో ఘటనలో... సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి అలియాస్ విజయ.. తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా నిర్థారించబడనప్పటికీ.. ఆమె ఒంటరితనంతో, జీవితంపై విరక్తి చెంది ఈ స్థాయి నిర్ణయం తీసుకుని ఉంటారనే సందేహాలు అటు పోలీసులతోపాటు అటు భర్త నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు. జీవితం పట్ల తాను సంతోషంగా లేనని ఆమె పేర్కొన్న పరిస్థితి!

ఈమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఆమె భర్త దుబాయ్ లో ఉంటున్నారు.. పిల్లలిద్దరూ హాస్టల్స్ లో ఉంటున్నారు! ఈ క్రమంలో ఆమె ఒంటరితనం వల్ల నిరాశ చెంది ఉండొచ్చని అంటున్నారు. ఈ రెండు ఘటనల్లోనూ ఐదుగురు పిల్లల మరణాలకు తల్లితండ్రులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమయ్యారనే చర్చ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు పరిగణలోకి తీసుకుని.. తల్లితండ్రులు పిల్లల విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు!

Tags:    

Similar News