మహా గడ్డుకాలం.. 146 ఏళ్ల తర్వాత దారుణ జూన్ ఇదేనట!

ఈ రోజు గడిస్తే ‘జూన్’ నెల పూర్తవుతుంది. గడిచిన కొన్నేళ్లలో.. ఆ మాటకు వస్తే గడిచిన 146 ఏళ్లలో ఇంతటి పొడి వాతావరణం ఉన్న జూన్ నెల ఇదేనన్న విషయాన్ని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Update: 2026-06-30 11:42 GMT

ఈ రోజు గడిస్తే ‘జూన్’ నెల పూర్తవుతుంది. గడిచిన కొన్నేళ్లలో.. ఆ మాటకు వస్తే గడిచిన 146 ఏళ్లలో ఇంతటి పొడి వాతావరణం ఉన్న జూన్ నెల ఇదేనన్న విషయాన్ని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సాధారణం కంటే దాదాపు 42 శాతం తక్కువ వర్షపాతం నమోదైన అత్యంత చెత్త జూన్ గా దీన్ని చెప్పొచ్చు. జూన్ నెలలో అత్యంత పొడి వాతావరణం ఎదుర్కొన్న అరుదైన ఏడాది ఇదే. అంతేకాదు గడిచిన పదిహేనేళ్లలో వేసవి రుతు పవనాలకు అత్యంత బలహీనమైన ఆరంభం ఇదేనని కూడా చెబుతున్నారు.

దేశంలోని 76 శాతం ప్రాంతాల్లో వర్షపాతం లోటు.. తీవ్ర లోటుగా ఉన్న దుస్థితి. అంతేకాదు.. ఈ పరిస్థితి ఇక్కడితో పూర్తి కాలేదని.. వచ్చే నెల (జూలై)లోనూ ఇలాంటి పరిస్థితే దాదాపు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత ఆందోళనకు గురి చేసే అంశం ఏమంటే.. సాగునీరు.. తాగునీరు కోసం దేశంలో ఏర్పాటైన 166 ప్రధాన జలాశయాలు జూన్ 25 నాటికి మొత్తం నిల్వ సామర్థ్యంలో 26 శాతాన్ని మాత్రమే కలిగి ఉన్నట్లు చెబుతున్నారు.

పసిఫిక్ లో పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత అదే ఎల్ నినో కారణంగా ఈ నెలలో రుతుపవన వర్షపాతంపుంజుకున్నప్పటికి జులైలో కురవాల్సిన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర ఆఫ్రికా నుంచి వేడి గాలిని రప్పించే స్థిరమైన అధిక పీడన వ్యవస్థ కారణంగా ఏర్పడిన వడగాల్పులు.. మనిషి చేసిన వాతావరణ మార్పులతో మరింత తీవ్రమయ్యాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఐరోపా వేసవి వాతావరణంపై ఎల్ నినో ప్రబావం పరిమితంగా ఉంది. అయితే.. ఈ ఏడాది భారత రుతుపవనాల (వర్షాల) మీద మాత్రం అధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. రానున్న రోజుల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News