పవన్, జూనియర్ ఎన్టీఆర్.. ఎవరి సినిమా ఫస్ట్ చూస్తారు? లోకేశ్ ఆన్సర్ వైరల్!

తెలివైన ప్రశ్నకు అంతకన్నా తెలివిగా సమాధానం చెప్పి రాజకీయ వివాదాలకు తావివ్వకుండా తప్పించుకున్నారు మంత్రి లోకేశ్.

Update: 2026-06-30 12:00 GMT

తెలివైన ప్రశ్నకు అంతకన్నా తెలివిగా సమాధానం చెప్పి రాజకీయ వివాదాలకు తావివ్వకుండా తప్పించుకున్నారు మంత్రి లోకేశ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మేన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ముందుగా ఎవరి సినిమా చూస్తారు? అంటూ లోకేశ్ కు ఎదురైన క్లిష్టమైన ప్రశ్నకు యువనేత చాకచక్యంగా సమాధానం చెప్పడమే హైలెట్ అంటున్నారు. ఈ ప్రశ్నతో రాజకీయాలు, వ్యక్తిగత, కుటుంబ బంధాల విషయంలో లోకేశ్ ను ఇరికించేలా మీడియా వ్యవహరిస్తే, మంత్రి ఏ మాత్రం కంగారు పడకుండా, ఇద్దరు ప్రముఖ హీరోలను బ్యాలెన్స్ చేస్తూ సమాధానం చెప్పడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు, ఏ ఒక్కరి పేరు చెప్పినా రాజకీయంగా రచ్చ జరిగే అవకాశం ఉంది. కానీ, మంత్రి లోకేశ్ ఎవరినీ నొప్పించకుండా, వివాదాలకు తావులేకుండా ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

చాకచక్యంగా తప్పించుకున్న లోకేశ్

"ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా లేక పవన్ కల్యాణ్ సినిమా చూస్తారా?" అన్న ప్రశ్నకు ఎలాంటి తడబాటు లేకుండా లోకేశ్ సమాధానం చెప్పడంతో మీడియా కూడా ఆశ్చర్యపోయిందని అంటున్నారు. ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఇటు సినీ పరిశ్రమలో, అటు రాజకీయంగా కూడా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నవారు. ఇద్దరినీ గౌరవిస్తూనే, ‘సినిమా విడుదలైన సమయాన్ని బట్టి, ఏది అందుబాటులో ఉంటే అది చూస్తాను’ అన్న అర్థం వచ్చేలా మంత్రి ఇచ్చిన సమాధానం చాలా తెలివైనదిగా కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వివాదాలను కోరుకోని లోకేశ్, ఇలాంటి సందర్భాల్లో తన సంయమనాన్ని ఏ విధంగా కాపాడుకుంటారో మరోసారి నిరూపించుకున్నారు.

రాజకీయ పరిపక్వతకు నిదర్శనం

గతంతో పోలిస్తే మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా ఎంతో పరిణతి చెందారనడానికి ఇలాంటి ఈ ఉదంతం పెద్ద నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ భవిష్యత్తు నాయకుడిగా ఎదురుగుతున్న మంత్రి లోకేశ్ ను వివాదాల్లోకి లాగాలనే ఉద్దేశంతో ప్రత్యర్థులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారని, కానీ మంత్రి మాత్రం ప్రత్యర్థుల ఉచ్చులో పడకుండా అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇది ఒక విధంగా మంత్రి లోకేశ్ సమర్థతను మరింత పదును పెట్టిందని కూడా విశ్లేషిస్తున్నారు.

ఈ సంఘటన ద్వారా మంత్రి లోకేశ్ కేవలం ఒక అడ్మినిస్ట్రేటర్‌గానే కాకుండా, రాజకీయ వ్యూహకర్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారని అంటున్నారు. ఎవరినీ కించపరచకుండా, అందరినీ సమానంగా చూసే లోకేశ్ శైలి ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఏదైనా ప్రశ్న ఎదురైనప్పుడు అనవసరమైన చర్చకు తావులేకుండా, చిరునవ్వుతో సమాధానం ముగించడంలోనే అసలైన రాజకీయ చతురత ఉందని లోకేశ్ నిరూపించారు.

Tags:    

Similar News