• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజీనామా చేయకుంటే బయట కి...

రాజీనామా చేయకుంటే బయట కి రాలేవు .. గవర్నర్ ని హెచ్చరించిన ఎంపీ !

By - Tupaki Desk
Update: 2020-01-03 07:25 GMT
తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం పౌరసత్వ సవరణ చట్టం పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాలలో ఈ ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ ఆందోళనలల్లో కొంతమంది ప్రాణాలని కూడా కోల్పోయారు. కొంతమంది ఈ చట్టానికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మంది ఈ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని తమ నిరసన తెలుపుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా కేరళలో కాంగ్రెస్ ఎంపీ ఒకరు ఈ పౌరసత్వ చట్టం విషయంలో ఏకంగా రాష్ట్ర గవర్నర్ కే వార్నింగ్ ఇచ్చారు. రాజీనామా చేయకపోతే .. వీధుల్లో తిరగలేరు అంటూ హెచ్చరించారు.

పూర్తి వివరాలు చూస్తే .. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు ని రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ లో చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమనీ.. అది చెల్లదని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఎంపీ సాక్షాత్తూ గవర్నరునే హెచ్చరించారు. కోజికోడ్ నగరం లో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టరులకు వ్యతిరేకం గా ‘సేవ్ ద నేషన్’ పేరిట జరిగిన ర్యాలీ లో ఎంపీ మురళీధ రన్ మాట్లాడుతూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయకుంటే, ఆయన కేరళ వీధుల్లో తిరగలేరని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం దేశ ప్రజలకు వ్యతిరేకమని, దీనిపై తాము రెండో స్వతంత్ర పోరాటం చేయాలని ఎంపీ అన్నారు. ప్రజాస్వామ్యం, న్యాయానికి ఈ పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకమని, దీనిపై 140 మంది సభ్యుల కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఎంపీ తెలిపారు. అయితే , ఈ తీర్మానానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. పౌరసత్వం అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దానితో ఎటువంటి సంబంధం ఉండదు. కేరళకు సంబంధం లేని ఓ అంశంపై వీరంతా ఎందుకిలా చేస్తున్నట్టు అని గవర్నర్ ఆరిఫ్ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో నిరసనలు చేస్తున్న వారిని ప్రశ్నించారు.


Tags:    
  • MP who warned the governo 
  • Kerala Governor 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki Updates 
  • Tupaki News 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS