• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ స్వరం మారింది...

మోడీ స్వరం మారింది గమనించారా?

By - Tupaki Desk
Update: 2016-12-25 17:30 GMT
మోడీ సంస్కరణవాదా.. రాజకీయవాదా.. సంస్కరణవాద ముసుగులో ఉన్న అసలు సిసలు రాజకీయ నాయకుడా? వీటన్నింటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలోనూ.. ప్రధానిగా మారిన తొలినాళ్లలోనూ మోడీ కచ్చితంగా సంస్కరణవాదే.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలు నమ్మింది కూడా అదే! ఆ సమయంలో మోడీ అంటే తెలియని వారంతా ప్రధాని హోదాలో మోడీని చూడటానికి కారణం ఒకటే. ఆయన్ని అంతా బీజేపీ నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా, మాస్ లీడర్ గా చూడలేదు. గుజరాత్ అభివృద్ధి కోణంలో మాత్రం చూశారు.. ఆ సమయంలో ప్రజలందరికీ కనిపించింది మోడీలో ఉన్న సంస్కరణవాది మాత్రమే. ఈ ఆలోచనే మోడీని గతంలో ఏ ప్రధానికీ రాని స్థాయిలో అవకాశం వచ్చేలా చేసింది.

అయితే తాజాగా మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం - అనంతర పరిణామాలు మోడీలో ఉన్న సంస్కరణవాదిని కనుమరుగుచేస్తుందనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతుంది! ప్రతీ విషయాన్ని సంస్కరణ కోణంలో చూసే మోడీ తాజాగా ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారనే విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. దానికి కారణం నోట్ల రద్దు విషయంపై ఎదురైన విమర్శలు - సలహాలు సూచనలకు మోడీ స్పందిస్తున్న విధానమే!

రాహుల్ గాంధీ చేసిన విమ‌ర్శలను కొట్టిపారేస్తే అర్ధం చేసుకోవచ్చు.. కానీ మ‌న్మోహ‌న్ సింగ్ చెప్పిన మాట‌ల‌కు కూడా పెడార్థాలు తీస్తే అది ప్రజలకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందనే విషయం మోడీ మరిచిపోకూడదు. ఇదే సమయంలో చిదంబరం చెప్పినట్లుగా సుమారు 50% గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు లేకపోవడం, ఇంటర్నెట్ సౌకర్యాల గురించి ఆలోచించకపోవడం వంటి సమస్యలున్న తరుణంలో నగదు రహితం అనే విషయం అసాధ్యం అనే భావన వ్యక్తపరుస్తున్నారు. వీటిలో రాజకీయంగా వారి వారి సలహాలనో విమర్శలనో సునాయాసంగా తిప్పికొట్టిన మోడీ... ఆ సమస్యలపై మాత్రం తనదైన సంస్కరణవాద సమాధానం కానీ పరిష్కారం కానీ తన మనసులో ఉన్న ఆలోచన కానీ వారికి సమాధానంగా కాకపోయినా, ప్రజలకు దైర్యం చెప్పడానికైనా చెప్పి ఉంటే బాగుండేది! ఈ విషయంలో నోట్ల రద్దుకు సంబందించి ఎవరు చేసే విమర్శలను అయినా సూచనలుగా బావించి జాగ్రత్తపడి ఉంటే ఈ సమస్య ఈ స్థాయిలో వచ్చి ఉండేది కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Modi 
  • Demonetisation 
  • Telugu NEWs 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS