• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణలో మరో అవినీతి...

తెలంగాణలో మరో అవినీతి తిమింగలం!!

By - Tupaki Desk
Update: 2020-09-09 09:30 GMT
కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన రోజే.. తెలంగాణలో ఆ శాఖలో మరో భారీ అవినీతి బయటపడడం కలకలం రేపింది. కేసీఆర్ అన్నట్టే తెలంగాణలో రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని అర్థమవుతోంది. తెలంగాణలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఓ భూ వివాదంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఏకంగా రూ.1.12కోట్లకు డీల్ కుదుర్చుకొని రూ.40 లక్షలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.

మొన్నటికి మొన్న కీసరలో ఓ తహసీల్దార్ కోటి 10లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెండ్ గా దొరికాడు. ఈ సంఘటన తెలంగాణతో యావత్ సంచలనమైంది. ఆ సంఘటన మరువక ముందే తెలంగాణలో మరో అత్యున్నత అధికారి రికార్డు స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. కీసర సంఘటనను తలదన్నేలా మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి తాజాగా పట్టుబడ్డాడు.

నర్సాపూర్ డివిజన్లోని చిప్పలకుర్తి గ్రామంలోని 113 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు కోటి 12లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కోటి రూపాయల మేర ఆస్తులకు లంచం కింద ఒప్పందం పత్రాలు రాసుకున్నాడు. తొలి విడుతగా బాధితులు 40లక్షల డబ్బులు నగేష్ కు ముట్టజేబుతుండగా ఏసీబీ పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

తెలంగాణ సర్కార్ కొత్త రెవిన్యూ చట్టం తీసుకొస్తుండడంతో ఇక తమ ఆటకు సాగవని రెవిన్యూ అధికారులు గ్రహించినట్లు ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పుడే అందినకాడికి దోచుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే అత్యాశకు పోయిన నగేష్ బాధితుల నుంచి లంచానికి కోటి 12లక్షల లంచానికి ఒప్పందం పత్రం రాసుకున్నాడు. ఈ ఒప్పంద పత్రమే ప్రస్తుతం అతడిని ఈ కేసు నుంచి తప్పించుకోకుండా చేసినట్లు కన్పిస్తుంది.

నగేష్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెండ్ గా పట్టుబడటంతో అతడి ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. అతడి ఆస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు, బ్లాక్ చెక్కులు, ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. కోటి 12లక్షల లంచానికి సంబంధించిన డీలులో 40లక్షల నగదు, 72లక్షలకు భూమి రిజిష్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందం రాసుకోవడం ఈ కేసులో ట్వీస్ట్ గా మారింది.
Tags:    
  • medak additional collector 
  • nagesh 
  • ACB 
  • Telangana 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS