చైనాపై భారీ ప్రతీకారం.. భారీగా ఫైటర్ జెట్స్ - యుద్ధ నౌకల మోహరింపు

Update: 2020-06-18 06:30 GMT
20మంది సైనికులను కోల్పోయిన భారత్ ప్రత్యర్థి చైనాకు గట్టి బుద్ది చెప్పాలని రెడీ అయ్యింది. చైనా పై చర్యలకు దిగే అవకాశాలను పూర్తిగా వాడుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే సైన్యాన్ని , బోఫార్స్ శతఘ్నుల వంటి ఆయుధ సామగ్రిని సరిహద్దు వద్దకు భారత్ చేర్చుతోంది. తాజాగా యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దింపిందని.. ఎల్ఏసీకి సమీపంలోని ఎయిర్ బేస్ లకు ఫైటర్ జెట్లను తరలించిందని కథనంలో పేర్కొన్నారు.

చైనాతో ఉద్రికత్తలపై వెనక్కితగ్గకూడదని బారత్ నిర్ణయించింది. తీవ్రంగా పరిగణిస్తూ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తోపాటు నేవిని కూడా దించుతోంది. చైనాకు కీలకమైన మలేషియా, ఇండోనేషియా దేశాల జలసంధి మలాకా వద్ద భారత్ యుద్ధ నౌకలను మోహరించిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైనాకు ఈ మలాకా జలసంధి చమురు వ్యాపారానికి ముఖ్యమైంది. దీంతో భారత్ ఇక్కడ యుద్ధ నౌకలను నిలపడం ద్వారా దేనికైనా సిద్ధమని ప్రకటించింది. దీంతో యుద్ధం తప్పదంటూ విదేశీ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ దేశం సార్వభౌమత్వం విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. దీటుగా బదులిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పటికే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ హెడ్ బిపిన్ రావత్ కు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయినట్టు తెలిసింది. తదుపరి ఆదేశాల అమలుకు ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ బలగాలు రెడీగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలిసిందని జాతీయ పత్రిక దిసన్ రాసుకొచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
Tags:    

Similar News