డ్రాయర్లు, బ్రాలపైనా జయలలిత ఫొటోలు

Update: 2015-12-09 07:42 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో ప్రస్తుత వరదల సమయంలోనూ చూశాం. వరద బాధితులకు సరఫరా చేసే ఆహార పొట్టాలపైనా ఆమె ఫొటోలు ముద్రించడం వివాదాస్పదంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అయితే... టెక్స్ టైల్ ఇండస్ట్రీకి పేరుగాంచిన తమిళనాడులో ఓ వస్త్ర వ్యాపారికి వరద బాధితులకు సహాయాన్ని జయలలిత ప్రచారానికి వాడుకోవడంపై ఒళ్లు మండిందట. అందుకు నిరసనగా ఆయన అండర్వేర్లు - బ్రాలపై జయలలిత ఫొటోలను ముద్రించాడు. అయితే... వాటిని బహిరంగ మార్కెట్ కు విడుదల చేయనప్పటికీ ఆ ఫొటోలను తన స్నేహితులకు పంపించాడు. కానీ, విషయం బయటకొచ్చేసి ఇప్పుడు జైలు పాలయ్యాడు.

కారైకుడికి చెందిన శరవణన్ కు టెక్స్ టైల్ దుకాణం ఉంది. మొన్నటి వరదల్లో టవళ్లు - బ్లాంకెట్లు - వంటివి ఆయన దుకాణంలో కొనుగోలు చేసిన అన్నాడీఎంకే నేతలు వాటిపై జయ ఫొటోను ముద్రించాలని అడిగారు. అందుకు ఆలస్యం అవుతుంది... దానివల్ల సాయం కూడా ఆలస్యం అవుతుందని ఆయన చెప్పినా వారు వినలేదట. దాంతో సహాయ సామగ్రిపై జయ ఫొటోను ముద్రించిన ఆయన పనిలో పనిగా డ్రాయర్లు - లంగాలు - బ్రాలపై జయ ఫొటోలు ప్రింటు చేశాడు. ఆ ఫొటోలను స్నేహితులకు పంపించాడు. ఈ విషయం బయటపడి అన్నా డీఎంకే కార్యకర్తలకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి నేరంగా కేసు నమోదు చేసి శరవణన్ ను జైలుకు పంపించారు.
Tags:    

Similar News