• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  20 ఏళ్ల వయసులో స్టేజ్ మీద...

20 ఏళ్ల వయసులో స్టేజ్ మీద ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిపోయాడు

By - Tupaki Desk
Update: 2022-09-09 04:49 GMT
అసలేం జరుగుతోంది? ఎందుకిలా జరుగుతోంది? కారణం ఏమిటి? ఇలా ఇప్పుడే జరుగుతున్నాయా? లేదా తరచూ జరిగేవా? లాంటి ఎన్నోప్రశ్నలు ఈ మధ్యన తెర మీదకు వస్తున్నాయి.కరోనా తర్వాత చోటు చేసుకుంటున్న కొన్ని మరణాలు రోటీన్ కు భిన్నంగా ఉంటున్నాయి.

అప్పటివరకు ఉత్సాహంగా.. అంతా బాగున్నట్లుగా ఉన్న వారు.. అప్పటికప్పుడు క్షణాల్లో కళ్లు తేలేసి.. ఆ వెంటనే కన్నుమూస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువగా జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లు.. లైవ్ వీడియోలు బయటకు వచ్చి షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఇలాంటి బాగా పెరిగిపోయాయి. కరోనా తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నా.. వాటిని సమర్థించేలా అధికారిక రిపోర్టులు ఇప్పటివరకు వెలువడలేదు. కార్డియాక్ అరెస్టు కొత్త విషయమేమీ కాకున్నా.. కరోనా తర్వాత ఇలాంటి ఉదంతాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అప్పటివరకు బాగానే ఉండి.. మాట్లాడుతూ మాట్లాడుతూ కుప్పకూలిపోవటం.. క్షణాల్లో నిర్జీవంగా మారిపోవటానికి సంబంధించిన వీడియో క్లిప్పులు పలువురిలో భయాందోళనలు నింపుతున్నాయి.

తాజాగా ఉదంతం ఆ కోవలోకి చెందినదే. జమ్ముకశ్మీర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం చూసినోళ్లంతా షాక్ తింటున్నారు. దీనికి కారణం.. ఇప్పటివరకు కార్డియాక్ అరెస్టుతో అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోయిన సామాన్యులు కావొచ్చు.. ప్రముఖులు.. సెలబ్రిటీలంతా మధ్య వయస్కులు 50కు దగ్గరగా ఉన్న వాళ్లు.. యాభైను జస్ట్ క్రాస్ చేసినవారే ఉంటున్నారు. కానీ.. తాజాగా విషాద ఉదంతం మాత్రం అందుకు భిన్నం.

కేవలం 20 ఏళ్ల వయసులో ఒక డ్యాన్సర్ స్టేజ్ మీద నర్తిస్తూనే ప్రాణాలు విడిచిన వైనానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. స్టేజ్ మీద పార్వతిదేవి వేషంలో ఉన్న 20 ఏళ్ల యువకుడు హుషారుగా తన టాలెంట్ ను ప్రదర్శిస్తున్నాడు అప్పటివరకు బాగానే ఉన్న అతగాడు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే.. అదంతా అతడి ప్రదర్శనలో భాగంగా తొలుత భావించారు.

పది సెకన్లకు పైనే ఎవరూ దగ్గరకు వెళ్లలేదు. అతడు కుప్పకూలిపోవటం.. కాస్త కాస్త కదలటంతో అనుమానం వచ్చిన శివుడు వేషధారిఅతడి వద్దకు రావటం.. తట్టి లేపటం.. పరిస్థితి తేడా వచ్చిందన్న విషయాన్ని అప్పటికి గుర్తించారు.అయితే.. అప్పటికే అతడు ప్రాణాలు విడిచిన వైనం అక్కడి వారికే కాదు.. వీడియో చూసే వారికి సైతం షాకింగ్ గా మారిన పరిస్థితి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View

Tags:    
  • JammuKashmir 
  • CardiacArrest 
  • ManDiesWhilePeformingDance 
  • ManDiesofCardiacArrestinGaneshUtsav 
  • ManDiesWhileDancinginJammu 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS