• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జైల్లో ఆర్యన్ కు ఆ భోజనమే...

జైల్లో ఆర్యన్ కు ఆ భోజనమే పెడతారు

By - Tupaki Desk
Update: 2021-10-09 03:21 GMT
అనూహ్య పరిణామాల మధ్య జైలుకు వెళ్లాల్సి వచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. అతని స్నేహితుల్ని ముంబయిలోని ఆర్దర్ జైల్లో ఉంచనున్నారు. తాజాగా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ.. పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచనున్న సంగతి తెలిసిందే. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తాజాగా కొట్టేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని.. అతని స్నేహితుల్ని అర్ధర్ జైలుకు తరలించారు.

వారికి అక్కడ బ్యారక్ నంబరు 1ను కేటాయించారు. జైలులోని మొదటి అంతస్తులో ఉన్న ప్రత్యేక క్వారంటైన్ బ్యారక్ గా దీన్ని చెప్పాలి. ఆర్యన్ కు అతని స్నేహితులకు కరోనా నెగిటివ్ గా తేలటం.. వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో.. వారిని జైల్లోని ఇతర ఖైదీల మాదిరి పరిగణిస్తారు.

వారంతా ఉదయం ఆరు గంటలకే లేవాల్సి ఉంటుంది. ఏడు గంటలకు టిఫిన్ పెడతారు. మధ్యాహ్నం 11 గంటలకు భోజనం.. సాయంత్రం ఆరు గంటలకు రాత్రి భోజనం అందిస్తారు. ఇక.. వారికి సాదాసీదా జైలు భోజనం మాత్రమే తినాల్సి ఉంటుంది. కాకుంటే.. వారికి సొంత డబ్బులతో జైల్లోని క్యాంటీన్ లో ఆహార పదార్థాల్ని కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఉదయం టిఫిన్ కింద షీరా - పోహా ఉంటుంది. మధ్యాహ్నం.. రాత్రి భోజనంలో చపాతి.. కూర.. పప్పు.. అన్నం వడ్డిస్తారు. ఇంటి నుంచి భోజనం అతనికి అందాలంటే కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు యువరాజు మాదిరి బతికిన ఆర్యన్ కు జైలు జీవితం ఎన్నో కొత్త అనుభవాల్ని నేర్పుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    
  • Shahrukh Khan Son 
  • Aryan Khan Arrest 
  • Aryan Khan Drugs Case 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS