ఏడాది ఉంటే చాలు..కుమారస్వామి నిర్వేదం..

Update: 2018-06-16 10:48 GMT
మే 12న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అతిపెద్ద పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బలం నిరూపించుకోలేక వైదొలిగింది. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ లు పొత్తు పెట్టుకొని కుమారస్వామిని సీఎం చేసి ప్రస్తుతానికి సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బండి లాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంపై సీఎం కుమారస్వామికి కూడా నమ్మకం లేకపోవడం తాజాగా సంచలనమైంది.

కలిసి కాపురం చేస్తూ కర్ణాటకలో కలహించుకుంటున్న కాంగ్రెస్-జేడీఎస్  ప్రభుత్వంపై సీఎం కుమారస్వామిలోనూ నమ్మకం లేదని తేలిపోయింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన సీఎంగా 5 ఏళ్లు ఉండడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది.

బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కుమారస్వామి మాట్లాడారు.. ‘కనీసం ఏడాది పాటు అంటే వచ్చే లోక్ సభ ఎన్నికల నాటి వరకైనా తనే సీఎంగా ఉంటానని ఆశిస్తున్నానని’ తెలిపాడు. ప్రస్తుతం ఏడాది వరకైతే గ్యారెంటీగా తాను సీఎంగా ఉంటానని.. రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏమి జరిగింది అని లెక్కలు తీసేదానికి బదులుగా.. తాను ఏమీ చేయాలనుకుంటున్నానో చేసి చూపిస్తానని కుమారస్వామి తెలిపారు.


Tags:    

Similar News