ల‌గ‌డ‌పాటి స‌ర్వే..కేటీఆర్ కీల‌క రిప్లై

Update: 2018-12-04 17:26 GMT
ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరొందిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కీల‌క స‌ర్వేను వెలువ‌రించి సంగ‌తి తెలిసిందే. మ‌హాకూట‌మికే మొగ్గు ఉంద‌ని,  పోలింగ్‌ శాతం తగ్గితే హంగ్‌ రావొచ్చన్న లగడపాటి.. ఒకవేళ తగ్గితే మహాకూటమికి అనుకూలంగా ఉంటుందన్నారు.  అయితే, దీనిపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేస్తూ ``లగడపాటిది సర్వే కాదు చిలక జోస్యం. చివ‌రి నిమిషంలో సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే  ప్రయత్నం. లగడపాటి , బాబు పొలిటికల్ టూరిస్టులు. డిసెంబర్ 11 న తట్ట బుట్ట సర్దేస్తారు.  wait and watch అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేపై సుప్ర‌సిద్ధ విశ్లేష‌కులు ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. తెలంగాణలో హంగ్ రాదు. ఓటింగ్ సరళికి సీట్ల‌కు సంబంధం లేదు. లగడపాటి చెప్పినదానికి హేతుబద్ధత లేదు. ఇండిపెండెంట్లు కూడా.. ఏదో ఒక పార్టీ కి చెందిన వారే. ప్రజలు ఏదో ఒక పార్టీ కి పూర్తి మెజారిటీ ఇస్తారని నా అభిప్రాయం అని ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు.

కాగా, గ‌త ఎన్నికల్లో వ‌లే పోలింగ్ 68.5 శాతం మాత్రమే నమోదు అయితేనే తన సర్వే అంచనాలు నిజమయ్యే అవకాశం ఉందని, పోలింగ్ శాతం పెరిగితే అంచనాలన్నీ తారుమారు అయ్యే అవకాశం ఉందని ల‌గ‌డ‌పాటి చెప్పిన సంగ‌తి తెలిసిందే. వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌జిల్లాలో టీఆర్‌ఎస్‌కు.. రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు ఆధిక్యం లభిస్తుందని చెప్పారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పోటాపోటీగా ఎన్నికల జరుగుతాయన్నారు. హైదరాబాద్‌పాటు జిల్లాల్లో కూడా బీజేపీకి సీట్లు వస్తాయన్నారు.
Tags:    

Similar News