• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఢిల్లీలో...

ఢిల్లీలో కాళ్లు..హైద‌రాబాద్‌ లో క‌న్నీళ్లు!

By - Tupaki Desk
Update: 2019-12-05 16:27 GMT
పనిచేసే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదని - ఎందుకీ చిన్నచూపు అని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌యుడు తెలంగాణ  ఐటీ - పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. టీఎస్‌ ఐపాస్ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాదాపూర్ శిల్పకళావేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... పారిశ్రామిక రంగంతో పాటు - రక్షణ రంగంలోనూ కేంద్రం రాజకీయాలు చేస్తోంద‌న్నారు. పనిచేసే రాష్ట్రాలను ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తాయని - కానీ దురదృష్టవశాత్తు అలా జరగడంలేదని చెప్పారు. దీనిపై, తెలంగాణ‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.

దక్షిణాదిని భాతర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలంగాణ‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్ప‌ష్టం చేశారు.  విభజన రాజకీయాలు చేయటం తండ్రి కొడుకుల(కేసీఆర్ - కేటీఆర్)కు పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. ఢిల్లీలో కాళ్ళు.. హైద‌రాబాద్ లో కన్నీళ్ళు అన్నట్టు.. తండ్రీ కొడుకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల‌ను రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. భారత ప్రభుత్వంపై ట్విట్టర్ పిట్ట‌.. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ర‌క్షణశాఖ భూములను కొట్టేయాలన్న టీఆర్ఎస్ ప్లాన్ ఫెయిల్ అయిందని - ఆ  భూములను ఇవ్వటం‌ కుదరదన్నందుకే... కేంద్రంపై కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నాడన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ నిందలు వేస్తున్నాడన్నారు. కేంద్రం నిధులను టీఆర్ ఎస్ ప్రభుత్వ పెద్దలు దారి మళ్ళించారన్నారు. కేంద్ర నిధులపై శాఖల వారీగా కేటీఆర్ తో చర్చకు సిద్ధమని చెప్పారు.

ధనిక రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దివాలా తీయించారని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిర్భయ నిధిని కూడా ఖర్చు చేయలేని స్థితిలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఎదిగిన టీఆర్ ఎస్.. నేడు తెలంగాణ అస్థిత్వానికే ముప్పుగా తయారైందని లక్ష్మణ్ ఆరోపించారు. దక్షిణాది కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ ఎటుపోయిందో.. కేటీఆర్ చెప్పాలన్నారు.
Tags:    
  • KTR 
  • Hyderabad IT Sector 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS