బ్రేకింగ్: తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ, ఫిట్ మెంట్ ఎంతంటే?

Update: 2021-03-22 08:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతన సవరణ వర్తిస్తుందని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ ను కేసీఆర్ ప్రకటించారు. కొత్త పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.ఈ పీఆర్సీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుందన్నారు.

కరోనాతో నెలకొన్న ఆర్థికమాంద్యం వల్ల వేతన సవరణ కాస్త ఆలస్యమైందని కేసీఆర్ అన్నారు. మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేపట్టామన్నారు.

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వేతన సవరణ వర్తిస్తుందన్నారు. వీఆర్ఏలు, ఆశావర్కర్లు అంగన్ వాడీలు, విద్యావలంటీర్లు సర్వశిక్ష అభియాన్లు, వీఏఓలు అందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. వీరందరికీ వేతనాలు పెంపుదల వర్తిస్తుందని అసెంబ్లీసాక్షిగా తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంత్ జిల్లాల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందరూ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. 9 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తి పరిచేవిధంగా కేసీఆర్ ప్రకటించారు. వేరు వేరు జిల్లాల్లో ఉన్న భార్యభర్తలను ఒకే జిల్లాకు వచ్చేందుకు అనుమతిచ్చారు.

తెలంగాణ సాధనలో ఉద్యోగులదీ కీలక పాత్ర అని.. అందుకే వారికి ఈ వరం ఇస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఇక ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
Tags:    

Similar News