• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫాంహౌస్ లోకి వెళితే ఓ...

ఫాంహౌస్ లోకి వెళితే ఓ పట్టాన తిరిగి రారే?

By - Tupaki Desk
Update: 2015-11-05 06:49 GMT
సమర్థ పాలనకు సెంటిమెంట్ల అవసరం ఉందా? అన్న ప్రశ్న వేస్తే.. లేదన్న మాటే వినిపిస్తోంది. అదేం చిత్రమో కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కాలం తరచూ ఫాంహౌస్ లోకి వెళితే తిరిగి రాని పరిస్థితి. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు తమకు నచ్చిన రీతిలో  పని చేసే వెసులుబాటు ఉంటుంది. నిజానికి అదేం తప్పు కూడా కాదు. కానీ.. సమస్యల్లా అది స్థాయికి మించితేనే ఇబ్బందంతా.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారమే చూస్తే.. ఆయన సచివాలయానికి రావటం దాదాపుగా మానేశారు. చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. ఆ విషయాన్ని అడిగే నాథుడే ఉండడు. వాస్తును విపరీతంగా నమ్మే ఆయనకు సచివాయలం వాస్తు మీద అసంతృప్తి ఉంది. దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు కొలిక్కి రాకపోవటంతో ఆయన సచివాలయానికి రావటం లేదు.

క్యాంప్ కార్యాలయం నుంచే పనులు నిర్వహిస్తున్నారు. ఇక.. తన ఫాంహౌస్ వద్ద అయుత చాండీయాగం నిర్వహించే విషయంలో కేసీఆర్ తలమునకలుగా ఉండటం తెలిసేందే. ఆదివారం ఫాంహౌస్ వెళ్లిన ఆయన ఇప్పటికీ అక్కడే ఉన్నారు. మరో రెండు రోజుల వరకూ ఆయన ఫాంహౌస్ నుంచి తిరిగి రారని చెబుతున్నారు. ఇక.. బుధవారం సంగతే తీసుకుంటే ఆయన ఎవర్నీ కలిసేందుకు ఇష్టపడలేదు. ఎవరికీ ఎలాంటి అపాయింట్ మెంట్లు ఇవ్వలేదు.

ముఖ్యమైన అవసరాలకు సంబంధించి కేసీఆరే ఫోన్లు చేసి సూచనలు చేస్తున్నారు. ఇదే తీరులో మరో రెండు రోజులు ఉండాలని భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. బుధవారం ఫాంహౌస్ లోపల పంటల్ని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా పలు సలహాలు ఇచ్చిట్లుగా చెబుతున్నారు. ఇలా ఫాంహౌస్ లోకి ఒకసారి వెళతే.. రోజుల తరబడి అందులోనే ఉండిపోతున్న కేసీఆర్ తీరు విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    
  • KCR 
  • Farm House 
  • Telugu NEWs 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS