• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శ్రీవారికి కేసీఆర్ మొక్కు...

శ్రీవారికి కేసీఆర్ మొక్కు నగలు రెఢీ

By - Tupaki Desk
Update: 2016-04-07 06:07 GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వామి వారికి పలు బంగారు ఆభరణాలు సమర్పిస్తానని మొక్కులు మొక్కుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మొక్కుకు తగ్గట్లే తాజాగా బంగారునగల్ని తయారు చేయించారు. వీటిని టీటీడీకి అందజేశారు. అయితే.. స్వామివారికి స్వయంగా అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ ఆహ్వానించిన నేపథ్యంలో.. ఆయన ఏప్రిల్ నెలాఖరులో తిరుమలకు వెళ్లనున్నారు. అయితే.. ఏ రోజున ఆయన ప్రయాణం ఉంటుందన్నది ఇంకా నిర్ణయం కాలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే తిరుమలేశుడికి తాను సమర్పిస్తానని చెప్పిన బంగారు ఆభరణాల కోసం రూ.5కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. కేసీఆర్ మొక్కకున్నట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో..  22 కేరట్ల మేలిమి బంగారంతో 14.9 కిలోల సాలిగ్రామ హారాన్ని తయారు చేయించారు. ఇందుకోసం రూ.3.7 కోట్లు ఖర్చుఅయ్యినట్లు చెబుతున్నారు. ఇక.. 4.65కిలోల బరువుతో ఐదు  పేటల కంఠాభరణాలను తయారుచేయించాలన్న మొక్కుకు తగినట్లుగా ఆభరణాల్ని సిద్ధం చేశారు. వీటి తయారీ కోసం టెండర్లు పిలవగా.. కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ జ్యూవెల్లర్స్ అయిన కీర్తిలాల్ కాళిదాస్ జ్యూయలర్స్ సంస్థ ఈ టెండర్ ను చేజిక్కించుకుంది.

సదరు సంస్థ ఈ మధ్యనే తిరుమల శ్రీవారికి ఈ ఆభరణాల్నిచేర్చింది. కేసీఆర్ మొక్కుల్ని అందుకున్న టీటీడీ.. ఆయన స్వయంగా వచ్చి స్వామివారికి మొక్కు చెల్లిస్తే బాగుంటుందన్న భావన వ్యక్తం చేయటంతో.. ఆయన తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో కేసీఆర్ తిరుమల పర్యటన ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా మరోసారి ఏపీ గడ్డ మీద కేసీఆర్ అడుగు పెట్టటం ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆసక్తికరంగా మారుతుందనటంలో సందేహం లేదు.
Tags:    
  • KCR 
  • TTD 
  • Tleugu NEws 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS