• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తప్పని తెగేసి చెప్పిన...

తప్పని తెగేసి చెప్పిన హరిక్రిష్ణ వారసుడు

By - Tupaki Desk
Update: 2022-09-22 11:39 GMT
తప్పుని తప్పు అని చెప్పడం ఎన్టీయార్ కి బాగా అలవాటు. ఆయన ఆ విషయంలో మొహమాటాలకు పోరు, ఎవరో ఏదో అనుకుంటారని కూడా అసలు  తగ్గరు. అలాంటి లక్షణాలు ఆయన తరువాత కొడుకుల్లో హరిక్రిష్ణకు మాత్రమే వచ్చాయి. ఆయన కూడా ముక్కుసూటి తనంతోనే తన జీవితాన్ని తుదిదాకా కొనసాగించారు. ఇపుడు ఆయన వారసులుగా ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో అగ్ర నటుడు జూనియర్ ఎన్టీయార్ హుందాగా స్పందిస్తే పెద్ద కొడుకు హీరో అయిన  కళ్యాణ్ రామ్ అయితే నిక్కచ్చిగానే రియాక్ట్ అయ్యారు.

తన తాతగారు ఏనాడో స్థాపించిన హెల్త్ యూనివర్శిటీ పేరుని ఇపుడు మార్చడమేంటని ఆయన నిగ్గదీశారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉనికి లో ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం పేరుని ఇపుడు అకస్మాత్తుగా మార్చడం తనకు బాధ అనిపించింది అని కళ్యాణ్ రా, ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం రాజకీయ లాభం కోసం చాలామంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అంటూ ఖండించారు కూడా. ఇక 1986లో తన తాత సీఎం గా ఉన్నపుడు వైద్య రంగంలో విశిష్ట సేవల కోసం ఈ విశ్వ విద్యాలయం స్థాపించబడింది అని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల విద్యార్హ్దులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి నాటి సీఎం ఎన్టీయార్ ఈ మహా విద్యాలయానికి అంకురార్పణ చేశారని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది అని కళ్యాణ్ రామ్ వివరించారు. లెక్కలేనంతమంది వైద్య నిపుణులను దేశానికి ఈ విశ్వవిద్యాయలం అందించింది అని ఆయన గుర్తు చేశారు. అలాంటి హెల్త్ వర్శిటీకి పేరు మార్చడం తప్పున్నర తప్పు అనే కళ్యాణ్ రామ్ కుండబద్ధలు కొట్టారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే నందమూరి ఫ్యామిలీ అంతా ఈ విషయాన  బాధతో ఆవేదనతో ఉంది. ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నా అందులో భావం తాత్పర్యం ఒక్కటే. మరి దాన్ని వైసీపీ సర్కార్ సానుకూలంగా తీసుకుని హెల్త్ వర్శిటీకి ఎన్టీయార్ పేరు మార్పు ఆలోచనను మార్చుకుంటే మంచిది అన్న మాట అయితే ఉంది మరి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TDPParty 
  • PoliticalNews 
  • APGovernment 
  • YSRCPGovernment 
  • APPolitics 
  • NTRHealthUniversityNameChange 
  • KalyanRam 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS