బాబు.. బాలయ్య మాట వింటాడా.?

Update: 2018-08-26 12:24 GMT
ప్రకాషం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు తన పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు.సహజంగానే అధికారి పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయన ఫైట్ ప్రత్యర్థిపైనే అనుకుంటారు. కానీ ఆయన పోరాడుతున్నది టీడీపీపైనే..

ప్రకాషం జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఉగ్రనరసింహారెడ్డి 2014 తర్వాత డల్ అయిపోయారు. ఇప్పుడాయన టీడీపీలో చేరేందుకు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇటు టీడీపీ కూడా సానుకూల సంకేతాలను పంపుతోందట..వచ్చే ఎన్నికల్లోపు ఉగ్రనరసింహారెడ్డి టీడీపీలో చేరితో కనిగిరి ఎమ్మెల్యే టిక్కెట్ తన్నుకుపోతారని గ్రహించి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబు రావులో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తనను గట్టేక్కించే బాధ్యతను సీఎం చంద్రబాబు బావ బాలయ్య మీదే పెట్టుకున్నాడట బాబు రావు.. అసలు బాలయ్యకు - బాబురావుకు లింకేటి అనుకుంటున్నారా.. అదీ చూద్దాం.

కనిగిరి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేగా కదిరి బాబు రావు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉగ్రనరసింహారెడ్డి వస్తే తన సీటు పోతుందని బాబు రావు ఆందోళనగా ఉన్నాడట.. చంద్రబాబు చేయించిన సర్వేలన్నింటిలో బాబురావుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందట.. ఆయన ఓడిపోతాడని బాబుకు సర్వేల్లో తేలిందట.. అందుకే ఉగ్రనరసింహారెడ్డి వైపు బాబు చూస్తున్నట్టు తెలిసింది.

ఉగ్రనరసింహారెడ్డికి తాజాగా బాబు అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఈయనకే కనిగిరి టిక్కెట్ ఇస్తారనే చర్చ మొదలైంది. దీనికి భయపడిపోతున్న కదిరి బాబు రావు బాలయ్యను ఆశ్రయించాడట.. బాలయ్యకు కదిరి మంచి స్నేహితుడు. 2014 ఎన్నికల్లో బాలయ్య ఆశీస్సులతోనే టిక్కెట్ పొంది విజయం సాధించాడు. కానీ ప్రజల్లో వ్యతిరేకతతో ఇప్పుడు టిక్కెట్ దక్కడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో బాలయ్యతో ఫైరవీ చేయించి మళ్లీ టిక్కెట్ పొందడానికి బాబు రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట.. మరి బాలయ్య మాట విని బాబు కదిరికి మళ్లీ చాన్సిస్తాడా లేక.. లేక ప్రజాదరణ ఉన్న ఉగ్రనరసింహారెడ్డికి టికెట్ ఇస్తారా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News